Maanaabadivai(nai?) vumdamgaa mannimtuvugaaga neeve

మానాపతివై(నై?) వుండఁగా మన్నింతువుగాక నీవే
Language

(॥పల్లవి॥)
మానాపతివై(నై?) వుండఁగా మన్నింతువుగాక నీవే
నానారీతులఁ గెలసి నవ్వ నాకుఁ దగునా

(॥॥)
కొత్తకొత్త మాట లాడి గుట్టుదెలుసుక నీపై
బత్తిచూసి వలపులు పైఁ జల్లీ నాకె
పొత్తుల నీడువెట్టేవు పొరుగాపెతో నన్ను
ఇత్తల నే నిల్లాల నింతసేయఁ దగునా

(॥॥)
మేసోఁక సేవలు సేసి మెప్పించుక నీకుఁ గడు-
నాసరేఁచి వీడెము లందిచ్చీ నాకె
ఆనేఁ తలు నేరుచుకొమ్మనేవు నీవు నన్ను
సేసపెండ్లి కూఁతురను సిగ్గువడఁ దగనా

(॥॥)
కన్నుచూపులు నాఁటించు కైవసముగాఁ జేసుక
చన్నులద్ది కూచ్చున్నది సంగడి నాకె
ఇన్నిటా శ్రీ వేంకటేశ ఇంతలో నన్నేలితివి
కన్నెదాన నాపెవలె గర్వించవచ్చునా

(||pallavi||)
mānābadivai(nai?) vuṁḍam̐gā manniṁtuvugāga nīve
nānārīdulam̐ gĕlasi navva nāgum̐ dagunā

(||||)
kŏttagŏtta māḍa lāḍi guṭṭudĕlusuga nībai
battisūsi valabulu paim̐ jallī nāgĕ
pŏttula nīḍuvĕṭṭevu pŏrugābĕdo nannu
ittala ne nillāla niṁtaseyam̐ dagunā

(||||)
mesom̐ka sevalu sesi mĕppiṁchuga nīgum̐ gaḍu-
nāsarem̐si vīḍĕmu laṁdichchī nāgĕ
ānem̐ talu nerusugŏmmanevu nīvu nannu
sesabĕṁḍli kūm̐turanu sigguvaḍam̐ daganā

(||||)
kannusūbulu nām̐ṭiṁchu kaivasamugām̐ jesuga
sannuladdi kūchchunnadi saṁgaḍi nāgĕ
inniḍā śhrī veṁkaḍeśha iṁtalo nannelidivi
kannĕdāna nābĕvalĕ garviṁchavachchunā