(॥పల్లవి॥)
మాన వెపుడు నీ మతకములు
కానుకలిచ్చుట గరిసించుటలా
(॥మాన॥)
మొగము చూచితే మొక్కఁగ వలదా
యెగసక్కెములని యెంచేవు
అగపడి తెలియక అడిగేనింతే
దగవులఁ బెట్టఁగఁ దలఁచితివా
(॥మాన॥)
వూరక పిలిచిన నూఁకొనవలదా
కేరడములనుచుఁ గెలసేవు
కారణము దెలిపి కప్పితి నింతే
గారవములే యివి కడు వెంగెములా
(॥మాన॥)
మెలుపునఁ గూడిన మెచ్చఁగవలదా
చలములనుచుఁ గడు జరసేవు
యెలమితో శ్రీవేంకటేశ కూడితివి
అలమేల్మంగ నే అలయించితినా
(||pallavi||)
māna vĕbuḍu nī madagamulu
kānugalichchuḍa garisiṁchuḍalā
(||māna||)
mŏgamu sūside mŏkkam̐ga valadā
yĕgasakkĕmulani yĕṁchevu
agabaḍi tĕliyaga aḍigeniṁte
dagavulam̐ bĕṭṭam̐gam̐ dalam̐sidivā
(||māna||)
vūraga pilisina nūm̐kŏnavaladā
keraḍamulanusum̐ gĕlasevu
kāraṇamu dĕlibi kappidi niṁte
gāravamule yivi kaḍu vĕṁgĕmulā
(||māna||)
mĕlubunam̐ gūḍina mĕchcham̐gavaladā
salamulanusum̐ gaḍu jarasevu
yĕlamido śhrīveṁkaḍeśha kūḍidivi
alamelmaṁga ne alayiṁchidinā