Maamtalela yimka maamtalela

మాఁటలేల యిఁక మాఁటలేల
Language

(॥పల్లవి॥)
మాఁటలేల యిఁక మాఁటలేల
మాఁటలేలరా మాయకాఁడా

(॥మాఁట॥)
చూచి చూచే చొక్కించితి
యేచి నీ చేఁత కేమందురా
కాచెఁ బూచెను కాఁగిట చన్నులు
లోఁచి చూడకు లోనైతి నీకు

(॥మాఁట॥)
నవ్వి నవ్వే నమ్మించితి
ఎవ్వరును నిఁక నేమనేరు
రవ్వసేసెను రాఁపగు వలపులు
తవ్వ కిఁక జోలిదక్కితి నేను

(॥మాఁట॥)
చేరి చేరి చేకొంటివి యింత
దూరఁబోతే దోసమిఁక
యేరా శ్రీ వేంకటేశ్వరుడా
రార కడపలో రతికెక్కెఁ బనులు

(||pallavi||)
mām̐ṭalela yim̐ka mām̐ṭalela
mām̐ṭalelarā māyagām̐ḍā

(||mām̐ṭa||)
sūsi sūse sŏkkiṁchidi
yesi nī sem̐ta kemaṁdurā
kāsĕm̐ būsĕnu kām̐giḍa sannulu
lom̐si sūḍagu lonaidi nīgu

(||mām̐ṭa||)
navvi navve nammiṁchidi
ĕvvarunu nim̐ka nemaneru
ravvasesĕnu rām̐pagu valabulu
tavva kim̐ka jolidakkidi nenu

(||mām̐ṭa||)
seri seri segŏṁṭivi yiṁta
dūram̐bode dosamim̐ka
yerā śhrī veṁkaḍeśhvaruḍā
rāra kaḍabalo radigĕkkĕm̐ banulu