Maamtalela manasugu manase saakshi

మాఁటలేల మనసుకు మనసే సాక్షి
Language

(॥పల్లవి॥)
మాఁటలేల మనసుకు మనసే సాక్షి
యేఁటికిఁ బరాకు సేసే వింతిఁ గావవయ్యా

(॥మాట॥)
కామినితాపమునకుఁ గప్పినపయ్యద సాక్షి
చేమిరిచింతకు చెక్కుచేయే సాక్షి
వాములవూరూపులకు వాడినమోవే సాక్షి
యేమరిపాటు విచ్చేసి ఇంతిఁ జూడవయ్యా

(॥మాట॥)
వడియుఁగన్నీటికిని వట్రునగుబ్బలే సాక్షి
తడుపుఁజెమటలకు తనువే సాక్షి
చిడుముడియలతకు చెదరుఁగురులే సాక్షి
యెడసేయక విచ్చేసి ఇంతిఁ గావవయ్యా

(॥మాట॥)
నీకెదురుచూచుటకు నిట్టచూపులే సాక్షి
పైకొన్నయవస్థలకు పానుపులే సాక్షి
చేకొని శ్రీవేంకటేశ చేరి కూడితి వింతట
యీకడ నిట్టే కరుణ నింతిఁ జూడవయ్యా

(||pallavi||)
mām̐ṭalela manasugu manase sākṣhi
yem̐ṭigim̐ barāgu sese viṁtim̐ gāvavayyā

(||māḍa||)
kāminidābamunagum̐ gappinabayyada sākṣhi
semirisiṁtagu sĕkkuseye sākṣhi
vāmulavūrūbulagu vāḍinamove sākṣhi
yemaribāḍu vichchesi iṁtim̐ jūḍavayyā

(||māḍa||)
vaḍiyum̐gannīḍigini vaṭrunagubbale sākṣhi
taḍubum̐jĕmaḍalagu tanuve sākṣhi
siḍumuḍiyaladagu sĕdarum̐gurule sākṣhi
yĕḍaseyaga vichchesi iṁtim̐ gāvavayyā

(||māḍa||)
nīgĕdurusūsuḍagu niṭṭasūbule sākṣhi
paigŏnnayavasthalagu pānubule sākṣhi
segŏni śhrīveṁkaḍeśha seri kūḍidi viṁtaḍa
yīgaḍa niṭṭe karuṇa niṁtim̐ jūḍavayyā