పల్లవి:
మాఘమాసం ఎప్పుడొస్తుందో
మౌనరాగాలెన్నినాళ్ళో
మంచు మబ్బు కమ్ముకొస్తుందో
మత్తు మత్తు ఎన్నియల్లో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ
మాఘమాసం ఎప్పుడొస్తుందో
మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా
వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ
చరణం 1:
తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు
నా ఆఆ కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
లేతలేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు
ఓయమ్మా... ఆ... ఆ... ఆ
హాయమ్మా వలపులే తొలిరేయమ్మా వాటేస్తే
చినవాడు నా సిగ్గు దాటేస్తే
మాఘమాసం ఎప్పుడొస్తుందో
మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ
చరణం 2:
తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
రాతి మనసున ప్రేమ అలజడి చిలికాడే చినవోడు
నా కంటి పాపకు కొంటె కలలను అలికాడే అతగాడు
వంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో
ఓయమ్మా... ఆ... ఆ... ఆ...
ఒళ్ళంతా మనసులే ఈ తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే శుభలగ్నమేనాడో
మాఘమాసం ఎప్పుడొస్తుందో
మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ