మాతోనేఁటికి నీవు మరిఁ బంతాలాడేవు
(॥పల్లవి॥)
మాతోనేఁటికి నీవు మరిఁ బంతాలాడేవు
ఆతలివారినే యిఁక ననరాదా నీవు
(॥మాతో॥)
పన్నుక నీచెక్కులపై పచ్చిచేఁతలతో వచ్చి
నన్ను దప్పక చూచేవు నగితినంటా
యెన్నిక మీరంగ నేఁడు యింతసేసిన ఆపెను
వన్నెలుగా నటు దూరవద్దా నీవు
(॥మాతో॥)
కుంకుమపూఁత చన్నుల గురుతులతోనే వచ్చి
సంకుమోవఁ దిట్టేవు చూచితినంటా
కంకిగా నిన్నిఁతారడిగాఁ జేసినాపెను
వంకలొత్తి సాదించవద్దా నీవు
(॥మాతో॥)
పేరిచిన నీమోవి పిడుచలతోనే వచ్చి
మేరమీరి తిట్టేవు మెచ్చితినంటా
యీరీతి శ్రీవేంకటేశయేలితివి నన్నాపెను
వారించక బుద్దిచెప్పవద్దా నీవు
(||pallavi||)
mādonem̐ṭigi nīvu marim̐ baṁtālāḍevu
ādalivārine yim̐ka nanarādā nīvu
(||mādo||)
pannuga nīsĕkkulabai pachchisem̐talado vachchi
nannu dappaga sūsevu nagidinaṁṭā
yĕnniga mīraṁga nem̐ḍu yiṁtasesina ābĕnu
vannĕlugā naḍu dūravaddā nīvu
(||mādo||)
kuṁkumabūm̐ta sannula guruduladone vachchi
saṁkumovam̐ diṭṭevu sūsidinaṁṭā
kaṁkigā ninnim̐tāraḍigām̐ jesinābĕnu
vaṁkalŏtti sādiṁchavaddā nīvu
(||mādo||)
perisina nīmovi piḍusaladone vachchi
meramīri tiṭṭevu mĕchchidinaṁṭā
yīrīdi śhrīveṁkaḍeśhayelidivi nannābĕnu
vāriṁchaga buddisĕppavaddā nīvu