మాతో నేల లేదనేవు మాటిమాటికి
(॥పల్లవి॥)
మాతో నేల లేదనేవు మాటిమాటికి
చేత దిష్టవై వుండఁగా చిత్తమునఁ బెట్టవు
(॥మాతో॥)
చన్నుల నొరసె నాపె సారె గొప్పు దువ్వేనంటా
సన్న సేసి మాటలాడె సంగడి నంటా
యెన్నికతో నీకాపె యిఁక నేమి సేయవలె
చెన్నుమీర నింకా నీవు చిత్తమునఁ బెట్టవు
(॥మాతో॥)
కదిసి కూచుండేనంటా కాలు దొక్కె నంతలోనె
వదినెనంటా నీతో వావి చెప్పెను
యెదుట నీకు దనివి యెంతట గాని నిండదు
చెదరదీవలపింకా చిత్తమునఁ బెట్టవు
(॥మాతో॥)
ఆకు మడిచిచ్చే నంటా ఆయములెల్లా ముట్టె
చేకొనే వూడిగాలంటాఁజేరికూడెను
యీకడ శ్రీ వేంకటేశ యీడా నన్నుఁ గూడితివి
చీకాకు లాపెరతి చిత్తానఁ బెట్టవు
(||pallavi||)
mādo nela ledanevu māḍimāḍigi
seda diṣhṭavai vuṁḍam̐gā sittamunam̐ bĕṭṭavu
(||mādo||)
sannula nŏrasĕ nābĕ sārĕ gŏppu duvvenaṁṭā
sanna sesi māḍalāḍĕ saṁgaḍi naṁṭā
yĕnnigado nīgābĕ yim̐ka nemi seyavalĕ
sĕnnumīra niṁkā nīvu sittamunam̐ bĕṭṭavu
(||mādo||)
kadisi kūsuṁḍenaṁṭā kālu dŏkkĕ naṁtalonĕ
vadinĕnaṁṭā nīdo vāvi sĕppĕnu
yĕduḍa nīgu danivi yĕṁtaḍa gāni niṁḍadu
sĕdaradīvalabiṁkā sittamunam̐ bĕṭṭavu
(||mādo||)
āgu maḍisichche naṁṭā āyamulĕllā muṭṭĕ
segŏne vūḍigālaṁṭām̐jerigūḍĕnu
yīgaḍa śhrī veṁkaḍeśha yīḍā nannum̐ gūḍidivi
sīgāgu lābĕradi sittānam̐ bĕṭṭavu