Maadalela raavayya maayimtigi

మాటలేల రావయ్య మాయింటికి
Language

(॥పల్లవి॥)
మాటలేల రావయ్య మాయింటికి
యీటువెట్టి కొసరితే నిందరును నగరా

(॥॥)
కూర వండి కసవేరఁగూడునా నిన్నననేల
గోరగీరితే నేరౌను కూచుండవయ్యా
చేరలాను దోసిటాను సేసవెట్టి పెండ్లాడి
ఆరజము సేయఁబోతే నందరును నగరా

(॥॥)
మంచమెక్కి వావులెంచ మరేల జంకించ నిన్ను
కంచుఁ బెంచు సరిగాదు కానీవయ్యా
కొంచనేల యెంచనేల కుసుమాస్త్రుబారిఁ జిక్కి
అంచెలఁ గాఁతాళించితే నందరును నగరా

(॥॥)
నానఁ బెట్టితే గొడ్డలి నయమౌనా బలిమేల
తేనెమోవి తీపుగాదా తెలిసే నీవయ్యా
నే నలమేల్మంగను నీవు శ్రీ వేంకటేశుఁడ-
వాన దోసి కూడితివి అందరును నగరా

(||pallavi||)
māḍalela rāvayya māyiṁṭigi
yīḍuvĕṭṭi kŏsaride niṁdarunu nagarā

(||||)
kūra vaṁḍi kasaveram̐gūḍunā ninnananela
goragīride neraunu kūsuṁḍavayyā
seralānu dosiḍānu sesavĕṭṭi pĕṁḍlāḍi
ārajamu seyam̐bode naṁdarunu nagarā

(||||)
maṁchamĕkki vāvulĕṁcha marela jaṁkiṁcha ninnu
kaṁchum̐ bĕṁchu sarigādu kānīvayyā
kŏṁchanela yĕṁchanela kusumāstrubārim̐ jikki
aṁchĕlam̐ gām̐tāḽiṁchide naṁdarunu nagarā

(||||)
nānam̐ bĕṭṭide gŏḍḍali nayamaunā balimela
tenĕmovi tībugādā tĕlise nīvayyā
ne nalamelmaṁganu nīvu śhrī veṁkaḍeśhum̐ḍa-
vāna dosi kūḍidivi aṁdarunu nagarā