(॥పల్లవి॥)
మాటలాడఁగదవె మంకులేఁటికి
నాఁటుకొనీతఁడు నీతో నవ్వు నవ్వఁగాను
(॥మాట॥)
చెఱఁగేల కట్టేవే చెక్కుచేయేల పెట్టేవే
మఱి యెదుటనే నీమగఁ డుండఁగా
నెఱులేల ముడువవే నేలనేమి వ్రాసేవే
తఱితో నీతఁడు నీదండ నుండఁగాను
(॥మాట॥)
చెమటేల తుడిచేవే శిరసేల వంచేవే
తమకిం చీతఁడు నిన్ను దప్పిదేర్చఁగా
సమమై యేల మొక్కేవేసారెనేల యలసేవే
జమళి నీతఁడు నీచన్ను లంటఁగాను
(॥మాట॥)
దిక్కులేల చూచేవే తెరయేల వేసేవే
నిక్కి శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ గూడఁగా
చొక్కి యెంత కోసరేవే సొలపు లెంతసేసేవే
మిక్కిలి యీతఁడే నీతో మేలమాడఁగాను
(||pallavi||)
māḍalāḍam̐gadavĕ maṁkulem̐ṭigi
nām̐ṭugŏnīdam̐ḍu nīdo navvu navvam̐gānu
(||māḍa||)
sĕṟam̐gela kaṭṭeve sĕkkuseyela pĕṭṭeve
maṟi yĕduḍane nīmagam̐ ḍuṁḍam̐gā
nĕṟulela muḍuvave nelanemi vrāseve
taṟido nīdam̐ḍu nīdaṁḍa nuṁḍam̐gānu
(||māḍa||)
sĕmaḍela tuḍiseve śhirasela vaṁcheve
tamagiṁ sīdam̐ḍu ninnu dappidersam̐gā
samamai yela mŏkkevesārĕnela yalaseve
jamaḽi nīdam̐ḍu nīsannu laṁṭam̐gānu
(||māḍa||)
dikkulela sūseve tĕrayela veseve
nikki śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ gūḍam̐gā
sŏkki yĕṁta kosareve sŏlabu lĕṁtaseseve
mikkili yīdam̐ḍe nīdo melamāḍam̐gānu