మాపు దాఁకానేల జోలి మంచివాఁడవే నీవు
(॥పల్లవి॥)
మాపు దాఁకానేల జోలి మంచివాఁడవే నీవు
రాఁపుసేయకుండరాదా రామ గలసీని
(॥మాపు॥)
నేరుపుల కెంతలేదు నీవు మాటాలాడేనంటే
మారుకొని వూఁకొనఁగ మాతరములా
మేరతోడివాఁడ వౌదు మెచ్చితిమి నిన్నుఁ దొల్లె
రారాదా యెందాఁక రమణి దిట్టీని
(॥మాపు॥)
ననుపులకుఁ గడమా నవ్వు నీవు నవ్వేనంటే
ఘనము మరి పెంచఁగలమా నేము
ఘనుఁడవు నీ వౌదువు కడమ నీయం దెంచము
యెనయరాదా ఇంతి యెగ్గులువట్టీని
(॥మాపు॥)
వేడుకలకు వెలితా వియ్యములందేనంటే
జాడతోడఁ గొసరేమా సారెకు నేము
కూడితివి వనితలను గొబ్బున శ్రీవేంకటేశ
తోడనే మోవియ్యరాదా తొయ్యలి వేఁడీని
(||pallavi||)
mābu dām̐kānela joli maṁchivām̐ḍave nīvu
rām̐puseyaguṁḍarādā rāma galasīni
(||mābu||)
nerubula kĕṁtaledu nīvu māḍālāḍenaṁṭe
mārugŏni vūm̐kŏnam̐ga mādaramulā
meradoḍivām̐ḍa vaudu mĕchchidimi ninnum̐ dŏllĕ
rārādā yĕṁdām̐ka ramaṇi diṭṭīni
(||mābu||)
nanubulagum̐ gaḍamā navvu nīvu navvenaṁṭe
ghanamu mari pĕṁcham̐galamā nemu
ghanum̐ḍavu nī vauduvu kaḍama nīyaṁ dĕṁchamu
yĕnayarādā iṁti yĕgguluvaṭṭīni
(||mābu||)
veḍugalagu vĕlidā viyyamulaṁdenaṁṭe
jāḍadoḍam̐ gŏsaremā sārĕgu nemu
kūḍidivi vanidalanu gŏbbuna śhrīveṁkaḍeśha
toḍane moviyyarādā tŏyyali vem̐ḍīni