Maa yimtigim daane vachchi mannimchum gaaga

మా యింటికిఁ దానే వచ్చి మన్నించుఁ గాక
Language

(॥పల్లవి॥)
మా యింటికిఁ దానే వచ్చి మన్నించుఁ గాక
సేయఁగల విన్నపాలు సేసేదేమే

(॥॥)
సేసవెట్టి యేలినాఁ డు చేరి బాసలిచ్చినాడు
లాసి మాటలాడినాఁడు లాలించినాఁడు
ఆసలెల్లాఁ జూపినాఁడు ఆలిఁ జేసుకొన్నవాఁడు
వేసరించి ఇఁకనేమి వేఁడుకొనేదేమే

(॥॥)
మనసుమర్మా లెఱుఁ గు మరి నావలపెరుఁగు
తనువుపైతఁ(త్య) మెరుఁగు తగవెరుఁగు
ననిచినపొందెరుఁగు నాఁటుకొన్నచూ పెరుఁగు
పెనఁగి యింకా నేను ప్రేమ రేఁచేదేమే

(॥॥)
మనుపనే ననుఁ జూచె మొక్కినమొక్కులు చూచె
తనగురుతులు చూచె దయఁ జూచె
యెనసె శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
చెనకి ఇంకాఁ దనకుఁ జెప్పేటిదేమే

(||pallavi||)
mā yiṁṭigim̐ dāne vachchi manniṁchum̐ gāga
seyam̐gala vinnabālu sesedeme

(||||)
sesavĕṭṭi yelinām̐ ḍu seri bāsalichchināḍu
lāsi māḍalāḍinām̐ḍu lāliṁchinām̐ḍu
āsalĕllām̐ jūbinām̐ḍu ālim̐ jesugŏnnavām̐ḍu
vesariṁchi im̐kanemi vem̐ḍugŏnedeme

(||||)
manasumarmā lĕṟum̐ gu mari nāvalabĕrum̐gu
tanuvubaidam̐(tya) mĕrum̐gu tagavĕrum̐gu
nanisinabŏṁdĕrum̐gu nām̐ṭugŏnnasū pĕrum̐gu
pĕnam̐gi yiṁkā nenu prema rem̐sedeme

(||||)
manubane nanum̐ jūsĕ mŏkkinamŏkkulu sūsĕ
tanagurudulu sūsĕ dayam̐ jūsĕ
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
sĕnagi iṁkām̐ danagum̐ jĕppeḍideme