మా తోడి గొడవేల మాపు దాఁకా నీకును
(॥పల్లవి॥)
మా తోడి గొడవేల మాపు దాఁకా నీకును
యీతలఁ జింతనసేయు మింకా నీ విపుడు
(॥మాతో॥)
చెలరేఁగి యాపె నీకుఁ జెప్పిన బుద్దులెల్లా
తలఁచి తలఁచి నీకు దాఁటరాదుగా
చలమున నాపె నీకు చదివించినవొజ్జలు
నెలవుల యిఁకఁ గొన్ని నేరుచుకో ఇపుడు
(॥మాతో॥)
వొద్దనుండి యాపె నీకు వుపదేశించినదెల్లా
తిద్దరానివేదములై తిరమాయఁగా
పొద్దు వొద్దు నీకు నాపె బోదించిన గురువు
సుద్దులెల్లా మరవక చొక్కుము నీవిపుడు
(॥మాతో॥)
చెక్కు నొక్కి కూడి యాపె నేసినట్టి విన్నపాలు
చక్కనై మదనరహస్యములాయఁగా
యిక్కువ శ్రీ వేంకటేశ యెనసితి విటునన్ను
తక్క కాపె అప్పణించె దైవము నీకిపుడు
(||pallavi||)
mā toḍi gŏḍavela mābu dām̐kā nīgunu
yīdalam̐ jiṁtanaseyu miṁkā nī vibuḍu
(||mādo||)
sĕlarem̐gi yābĕ nīgum̐ jĕppina buddulĕllā
talam̐si talam̐si nīgu dām̐ṭarādugā
salamuna nābĕ nīgu sadiviṁchinavŏjjalu
nĕlavula yim̐kam̐ gŏnni nerusugo ibuḍu
(||mādo||)
vŏddanuṁḍi yābĕ nīgu vubadeśhiṁchinadĕllā
tiddarānivedamulai tiramāyam̐gā
pŏddu vŏddu nīgu nābĕ bodiṁchina guruvu
suddulĕllā maravaga sŏkkumu nīvibuḍu
(||mādo||)
sĕkku nŏkki kūḍi yābĕ nesinaṭṭi vinnabālu
sakkanai madanarahasyamulāyam̐gā
yikkuva śhrī veṁkaḍeśha yĕnasidi viḍunannu
takka kābĕ appaṇiṁchĕ daivamu nīgibuḍu