Maa paabaalu tolagimchu

మా పాపాలు తొలగించు
Year
Language

పల్లవి:

మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య ||2||

చరణం 1:

పసిపాప మనసున్న ప్రతిమనిషిలోను పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్దుడవుతాడని
గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
తలపుల్ని తీసేస్తివి, మా కలతలని మాపేస్తివి

చరణం 2:

పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్య
వారి బాధల్ని మోసావయ్య
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో
నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నివాసమాయే ధన్యులమయినామయ్య
మాకు దైవామైవెలిసావయ్య

pallavi:

mā pābāla tŏlagiṁchu dībāla nīve vĕligiṁchināvayya
mammu karuṇiṁchināvayya
janma janmāla puṇyāla paṁṭalle ninnu darśhiṁchināmayya
memu tariyiṁchināmayya ||2||

saraṇaṁ 1:

pasibāba manasunna pradimaniṣhilonu paramātmuḍunnāḍani
vāḍu pariśhudduḍavudāḍani
goḽīla āḍallo kŏṁḍaṁta satyaṁ sāḍāvu o sāyi
mammu sāgāvu mā sāyi
vāsanalu veraina varṇālu ĕnnainā pūlanni ŏgaḍaṁṭivi
ninnu pūjiṁcha tagunaṁṭivi
mā taḍileni hṛdayāla dayadoḍi taḍibi
talabulni tīsestivi, mā kaladalani mābestivi

saraṇaṁ 2:

pĕḍuduṁṭe pĕrigedi premanna annaṁ migiledi ī puṇyaṁ
ichchu melaina pai janmaṁ
rogulni premiṁchi vyādhulni mābi marujanma ichchāvayya
vāri bādhalni mosāvayya
enāḍu puṭṭāvo eḍeḍa tirigāvo
nuvvĕṁta vāḍaidivo nuvvu enāḍi daivānivo
ī dvāragāmāyi nivāsamāye dhanyulamayināmayya
māgu daivāmaivĕlisāvayya