మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
పల్లవి:
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్నా చిరునవ్వు నీవే
నీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
చరణం 1:
గోరంత పసుపు నీవడిగినావు .. నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు
క్షణమొక్క ఋణమై పెరిగింది బంధం .. త్యాగాలమయమై సంసారబంధం
నీ చేయి తాకి చివురించె చైత్రం .. ఈ హస్తవాసే నాకున్న నేస్తం .. అనురాగ సూత్రం !!
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీదే
మీ కంట తడిని నే చూడలేను
చరణం 2:
మా అమ్మ నీవై కనిపించినావు .. ఈ బొమ్మనెపుడో కదిలించినావు
నిను చూడగానే పొంగింది రక్తం .. కనుచూపులోనే మెరిసింది పాశం
నీ కంటి చూపే కార్తీకదీపం .. దైవాలకన్నా దయ ఉన్న రూపం .. ఈ ఇంటి దీపం !!!
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీదే
మీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
pallavi:
mā iṁṭilona mahalakṣhmi nīve
mā kaṁṭa vĕlige gṛhalakṣhmi nīve
sirulĕnno unnā sirunavvu nīve
nī kaṁṭa taḍini ne sūḍalenu
mā iṁṭilona mahalakṣhmi nīve
saraṇaṁ 1:
goraṁta pasubu nīvaḍigināvu .. nūreḽḽa bradugu māgichchināvu
kṣhaṇamŏkka ṛṇamai pĕrigiṁdi baṁdhaṁ .. tyāgālamayamai saṁsārabaṁdhaṁ
nī seyi tāgi sivuriṁchĕ saitraṁ .. ī hastavāse nāgunna nestaṁ .. anurāga sūtraṁ !!
mā iṁṭilona mahalakṣhmi nīve
mā kaṁṭa vĕlige gṛhalakṣhmi nīve
sirulĕnno unnā sirunavvu mīde
mī kaṁṭa taḍini ne sūḍalenu
saraṇaṁ 2:
mā amma nīvai kanibiṁchināvu .. ī bŏmmanĕbuḍo kadiliṁchināvu
ninu sūḍagāne pŏṁgiṁdi raktaṁ .. kanusūbulone mĕrisiṁdi pāśhaṁ
nī kaṁṭi sūbe kārdīgadībaṁ .. daivālagannā daya unna rūbaṁ .. ī iṁṭi dībaṁ !!!
mā iṁṭilona mahalakṣhmi nīve
mā kaṁṭa vĕlige gṛhalakṣhmi nīve
sirulĕnno unnā sirunavvu mīde
mī kaṁṭa taḍini ne sūḍalenu
mā iṁṭilona mahalakṣhmi nīve
mā kaṁṭa vĕlige gṛhalakṣhmi nīve