Logu lemamduroyani lomgem gaaga

లోకు లేమందురోయని లోఁగేఁ గాక
Language

(॥పల్లవి॥)
లోకు లేమందురోయని లోఁగేఁ గాక
మేకొని నిన్నిట్టె కిందుమీఁదు సేయనా

(॥లోకు॥)
మానవుగా అదేమోయి మాటిమాటికిఁ దిట్టేవు
కానీలే మగనాలింత కడునసుదా
పోనీపోనిమ్మనికాక పొరుగిరుగు మొరఁగి
తేనెవంటినీమదము దించ నిట్టె వోపనా

(॥లోకు॥)
వుండవుగా చక్కజాడ నొకటొకటె చెనకే-
వండనే ఇల్లాండ్లింత ఆటపాటలా
కొండవంటిదొర వంటా గొంకీతిఁగా కిట్లయితే
కండగర్వమెల్లాఁ దీర్చి కంకిసేయనోపనా

(॥లోకు॥)
విడువవుగా చలము వెసఁ గాఁపురాలుసేసే-
పడఁతుల కూరనుండఁ బాసెనా యేమి
యెడపుశ్రీవేంకటేశ యింతలోఁ గూడితిఁగాక
విడువనిపంతమైతే వింత వింత సేయనా

(||pallavi||)
logu lemaṁduroyani lom̐gem̐ gāga
megŏni ninniṭṭĕ kiṁdumīm̐du seyanā

(||logu||)
mānavugā ademoyi māḍimāḍigim̐ diṭṭevu
kānīle maganāliṁta kaḍunasudā
ponībonimmanigāga pŏrugirugu mŏram̐gi
tenĕvaṁṭinīmadamu diṁcha niṭṭĕ vobanā

(||logu||)
vuṁḍavugā sakkajāḍa nŏgaḍŏgaḍĕ sĕnage-
vaṁḍane illāṁḍliṁta āḍabāḍalā
kŏṁḍavaṁṭidŏra vaṁṭā gŏṁkīdim̐gā kiṭlayide
kaṁḍagarvamĕllām̐ dīrsi kaṁkiseyanobanā

(||logu||)
viḍuvavugā salamu vĕsam̐ gām̐purālusese-
paḍam̐tula kūranuṁḍam̐ bāsĕnā yemi
yĕḍabuśhrīveṁkaḍeśha yiṁtalom̐ gūḍidim̐gāga
viḍuvanibaṁtamaide viṁta viṁta seyanā