Lagimamma kaamgilichchi laavula mechchee

లకిమమ్మ కాఁగిలిచ్చి లావుల మెచ్చీ
Language

(॥పల్లవి॥)
లకిమమ్మ కాఁగిలిచ్చి లావుల మెచ్చీ
సకలము మేలు సరసము లాడరయ్యా

(॥లకి॥)
కొండలపడవనీడ(?) కోరిన చెంచులవాడ
వుండి నవ్వే వౌనయ్య వువిదతోడ
నిండెను వలపు లాడ నీమో మాకె చూడ
పెండిలి మీకిద్దరికిఁ బెనగోనీనయ్యా

(॥లకి॥)
గొప్పమాఁకులకోన కురిసేటి నిచ్చవాన
వుప్పతిల్లి చేయివేసే వువిదమేన
చిప్పిలీఁ జెనుటసోనసిగ్గులు లోలో నాన
కప్పెను మీ కిద్దరికిఁ గడుమోహాలయ్యా

(॥లకి॥)
భవనాళియేటిదండపడఁతికోర్కులునిండ
జవళి నీవద్ద నండు సంగడిఁ బండ
తివిరి శ్రీ వేంకటాద్రి సుగ్రీవ నారసింహా
వివరించ నిద్దరికి వేడుకాయ నయ్యా

(||pallavi||)
lagimamma kām̐gilichchi lāvula mĕchchī
sagalamu melu sarasamu lāḍarayyā

(||lagi||)
kŏṁḍalabaḍavanīḍa(?) korina sĕṁchulavāḍa
vuṁḍi navve vaunayya vuvidadoḍa
niṁḍĕnu valabu lāḍa nīmo māgĕ sūḍa
pĕṁḍili mīgiddarigim̐ bĕnagonīnayyā

(||lagi||)
gŏppamām̐kulagona kuriseḍi nichchavāna
vuppadilli seyivese vuvidamena
sippilīm̐ jĕnuḍasonasiggulu lolo nāna
kappĕnu mī kiddarigim̐ gaḍumohālayyā

(||lagi||)
bhavanāḽiyeḍidaṁḍabaḍam̐tigorguluniṁḍa
javaḽi nīvadda naṁḍu saṁgaḍim̐ baṁḍa
tiviri śhrī veṁkaḍādri sugrīva nārasiṁhā
vivariṁcha niddarigi veḍugāya nayyā