లాలుదర్వాజ లస్కర్ బోనాల్ పండగ
పల్లవి:
లాలుదర్వాజ లస్కర్ బోనాల్ పండగ కొస్తనని రాకపోతివి
లక్డికాపూలు పోరికి లబ్బరు గాజులు తెస్తనని తెకవోతివి
అవ్మల్లా.....ఒట్టిజూట మాటచెప్పి వొచ్చెదాక లొల్లివెట్టి
పట్టుకుంటె పోరగాడు పలకనామ పారిపోయె తుర్.ర్.ర్.ర్.ర్.
చరణం 1:
అడేసెలికాడు నాకు లాటీ పోలీసువోడు ఆణ్ణే ప్రేమెంచినాను సైసైసై
కిష్టా నీకంటేవాడు ఇంకా మాకొంటెవాడు
కన్నేకొట్టిండు నాకు హొయ్హొయ్హొయ్
నెవలి ఫించెమొకటె తక్కువ
ఆడి పొగరు చూస్తె తగని మక్కువ
నాకుమాత్రమేమి తక్కువ ఆడె పుస్తెగట్టి పెనిమిటవ్వగా
యాడికో ఉర్కుతాడనే ఏసినా ముక్కుతాడునే
కొంగులాగి నోడితొనె కొంగుముల్లు ఏసుకున్న
ఏడుకైన కన్నె ఊసు నేడుమల్ల సెప్పుకున్న.....కుర్....
సమజైనదా
చరణం 2:
టొపీ సెప్రాసికన్న బీడీ బంట్రోతుకన్న
పోలీస్ పటేల్ బత్కు
డొయ్డొయ్డొయ్
గదిలో పెండ్లాంతొ ఉన్నా గంటల్ ఫోనొస్తెమల్ల
ఎంటన్ పెట్టాల్పర్లు రయ్రయ్రయ్
పొద్నలేస్తె కూనికేసులు
బందులైతె గస్తి తిర్గుడు
ఆడ బందూకెత్తిగోలీకాల్పులు
ఉండవే కంటినిద్రలు..యలికే తిండితిప్పలు
ఆడ్విదిక్కు బద్లాయిస్తె ఆలుబిడ్డ యాదమర్చి
ఆకూలం మెక్కుడేలె మీకుబలం మింగుడేలె తుర్.ర్.ర్.ర్.
జర గుస్సజైకున్రి నే సచ్చే జెప్తున్నా
pallavi:
lāludarvāja laskar bonāl paṁḍaga kŏstanani rāgabodivi
lakḍigābūlu porigi labbaru gājulu tĕstanani tĕgavodivi
avmallā.....ŏṭṭijūḍa māḍasĕppi vŏchchĕdāga lŏllivĕṭṭi
paṭṭuguṁṭĕ poragāḍu palaganāma pāriboyĕ tur.r.r.r.r.
saraṇaṁ 1:
aḍesĕligāḍu nāgu lāḍī polīsuvoḍu āṇṇe premĕṁchinānu saisaisai
kiṣhṭā nīgaṁṭevāḍu iṁkā māgŏṁṭĕvāḍu
kannegŏṭṭiṁḍu nāgu hŏyhŏyhŏy
nĕvali phiṁchĕmŏgaḍĕ takkuva
āḍi pŏgaru sūstĕ tagani makkuva
nāgumātramemi takkuva āḍĕ pustĕgaṭṭi pĕnimiḍavvagā
yāḍigo urgudāḍane esinā mukkudāḍune
kŏṁgulāgi noḍidŏnĕ kŏṁgumullu esugunna
eḍugaina kannĕ ūsu neḍumalla sĕppugunna.....kur....
samajainadā
saraṇaṁ 2:
ṭŏbī sĕprāsiganna bīḍī baṁṭroduganna
polīs paḍel batku
ḍŏyḍŏyḍŏy
gadilo pĕṁḍlāṁtŏ unnā gaṁṭal phonŏstĕmalla
ĕṁṭan pĕṭṭālbarlu rayrayray
pŏdnalestĕ kūnigesulu
baṁdulaidĕ gasti tirguḍu
āḍa baṁdūgĕttigolīgālbulu
uṁḍave kaṁṭinidralu..yalige tiṁḍidippalu
āḍvidikku badlāyistĕ ālubiḍḍa yādamarsi
āgūlaṁ mĕkkuḍelĕ mīgubalaṁ miṁguḍelĕ tur.r.r.r.
jara gussajaigunri ne sachche jĕptunnā