Korinatte aaya neegu govimdumdaa | maa

కోరినట్టె ఆయ నీకు గోవిందుఁడా । మా
Language

(॥పల్లవి॥)
కోరినట్టె ఆయ నీకు గోవిందుఁడా । మా-
కూరిమి మఱవకుమీ గోవిందుఁడా

(॥కోరి॥)
క్రొమ్మెఱుఁగుచూపుగోవిందుఁడా
కుమ్మరించేవు వలపు గోవిందుఁడా
కుమ్మెవో గోర నొత్తకు గోవిందుఁడా నీ -
కొమ్మలెల్లా నవ్వేరు గోవిందుఁడా

(॥కోరి॥)
కొలనిలోవారము గోవిందుఁడా నీకుఁ
గొలువుసేసేము గోవిందుఁడా
కొలము గొల్లెతలము గోవిందుఁడా
కొలకొల నవ్వుదురా గోవిందుఁడా

(॥కోరి॥)
కుందణపుచాయమేని గోవిందుఁడా
గొందినేల పవ్వళించ గోవిందుఁడా
చెందె ని న్నలమేల్ మంగ శ్రీవేంకటేశ నిన్నాడు-
కొందుముసుమ్మీ నేము గోవిందుఁడా

(||pallavi||)
korinaṭṭĕ āya nīgu goviṁdum̐ḍā | mā-
kūrimi maṟavagumī goviṁdum̐ḍā

(||kori||)
krŏmmĕṟum̐gusūbugoviṁdum̐ḍā
kummariṁchevu valabu goviṁdum̐ḍā
kummĕvo gora nŏttagu goviṁdum̐ḍā nī -
kŏmmalĕllā navveru goviṁdum̐ḍā

(||kori||)
kŏlanilovāramu goviṁdum̐ḍā nīgum̐
gŏluvusesemu goviṁdum̐ḍā
kŏlamu gŏllĕdalamu goviṁdum̐ḍā
kŏlagŏla navvudurā goviṁdum̐ḍā

(||kori||)
kuṁdaṇabusāyameni goviṁdum̐ḍā
gŏṁdinela pavvaḽiṁcha goviṁdum̐ḍā
sĕṁdĕ ni nnalamel maṁga śhrīveṁkaḍeśha ninnāḍu-
kŏṁdumusummī nemu goviṁdum̐ḍā