కోరిన కోరిక లిట్టె కొనసాగక మానవు
(॥పల్లవి॥)
కోరిన కోరిక లిట్టె కొనసాగక మానవు
నేరుపులెల్లా నేడే నించవలెఁగాని
(॥కోరి॥)
పొలఁతులెదుట నీవు పొద్దు వోనిమాట లాడి
వలపులు రేఁచితివి వాఁటముగాను
తలవంచుకొని ఇఁకఁ దప్పించుకొంటేఁ బోదు
వెలయ రతుల విఱ్ఱవీఁగ వలెఁగాని
(॥కోరి॥)
సిగ్గువడేవారిఁ వద్ద జేయరానిచేఁత సేసి
వెగ్గళము నవ్వతివి వేడుకగాను
బగ్గన నింతటిమీఁదఁ బరాకుసేయఁగరాదు
కగ్గులేక రతి కొడిగట్టవలెఁగాని
(॥కోరి॥)
చెలికత్తియలతోడఁ జేరి యేకతములాడి
చిలికితివి యాసలు శ్రీవేంకటేశ
అలమేలుమంగ నేలి తౌఁగాదనఁగరాదు
యలమి రతికిఁ జనవియ్యవలెఁగాని
(||pallavi||)
korina koriga liṭṭĕ kŏnasāgaga mānavu
nerubulĕllā neḍe niṁchavalĕm̐gāni
(||kori||)
pŏlam̐tulĕduḍa nīvu pŏddu vonimāḍa lāḍi
valabulu rem̐sidivi vām̐ṭamugānu
talavaṁchugŏni im̐kam̐ dappiṁchugŏṁṭem̐ bodu
vĕlaya radula viṭravīm̐ga valĕm̐gāni
(||kori||)
sigguvaḍevārim̐ vadda jeyarānisem̐ta sesi
vĕggaḽamu navvadivi veḍugagānu
baggana niṁtaḍimīm̐dam̐ barāguseyam̐garādu
kaggulega radi kŏḍigaṭṭavalĕm̐gāni
(||kori||)
sĕligattiyaladoḍam̐ jeri yegadamulāḍi
siligidivi yāsalu śhrīveṁkaḍeśha
alamelumaṁga neli taum̐gādanam̐garādu
yalami radigim̐ janaviyyavalĕm̐gāni