Kori yemdugainaa niyyagovalem gaaga

కోరి యెందుకైనా నియ్యకోవలెఁ గాక
Language

(॥పల్లవి॥)
కోరి యెందుకైనా నియ్యకోవలెఁ గాక
తారుకాణలైన మీఁద తప్పించుకోవచ్చునా

(॥కోరి॥)
మక్కువ గలుగుకాంత మరి యేమాఁటలాడినా
అక్కరతో వినవలె నౌ ననవలె
యిక్కడక్కడివారు నిన్నేమందురోయంటా
తక్కక సిగ్గుతో నీకు తలవంచవచ్చునా

(॥కోరి॥)
చుట్టమైన జవరాలు సొలసి యెంత నవ్వినా
గట్టిగా నోరువవలె కలయవలె
గుట్టుమీరి నీమీఁద గురుతులు మోచీనంటా
వొట్టినవలపు దాఁచి వూరకుండవచ్చునా

(॥కోరి॥)
బత్తిగల కోమల పట్టి యెంత వెనఁగినా
చిత్తగించి కూడవలె చే కొనవలె
యిత్తల శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి
కొత్తగా నాపె నెససి కొంక నింకవచ్చునా

(||pallavi||)
kori yĕṁdugainā niyyagovalĕm̐ gāga
tārugāṇalaina mīm̐da tappiṁchugovachchunā

(||kori||)
makkuva galugugāṁta mari yemām̐ṭalāḍinā
akkarado vinavalĕ nau nanavalĕ
yikkaḍakkaḍivāru ninnemaṁduroyaṁṭā
takkaga siggudo nīgu talavaṁchavachchunā

(||kori||)
suṭṭamaina javarālu sŏlasi yĕṁta navvinā
gaṭṭigā noruvavalĕ kalayavalĕ
guṭṭumīri nīmīm̐da gurudulu mosīnaṁṭā
vŏṭṭinavalabu dām̐si vūraguṁḍavachchunā

(||kori||)
battigala komala paṭṭi yĕṁta vĕnam̐ginā
sittagiṁchi kūḍavalĕ se kŏnavalĕ
yittala śhrīveṁkaḍeśha yiṁtalo nannelidivi
kŏttagā nābĕ nĕsasi kŏṁka niṁkavachchunā