కోరి వింద విటు రారే గొల్లెతలాల
(॥పల్లవి॥)
కోరి వింద విటు రారే గొల్లెతలాల
మేరతో మన కతఁడు మేనమరఁది
(॥కోరి॥)
ఆవుల మందలలోన నదె పిల్లఁదురు లూదీ
చేవమీరే వేడుకతోఁ జిన్ని కృష్ణుఁడు
పూవులతోఁటలోన పొంచి గొబ్బిళ్లఁ బాడీని
వేవేలు చందాలతోడ వెన్నముద్ద కృష్ణుఁడు
(॥కోరి॥)
రచ్చకొట్టాలలో నుండి రాగాన నీలలువెట్టీ
గచ్చులు సేయుచు కోడెకాఁడు కృష్ణుఁడు
తచ్చి నీలాటిరేవుల తగిలి సన్నలు సేసీ
పచ్చిమాఁట లాడుకొంటా బాలకృష్ణుఁడు
(॥కోరి॥)
దొరకొని యమునలో తుత్తురుఁగొమ్ము వట్టీని
అరుదుగా శ్రీ వేంకటేద్రి కృష్ణుఁడు
వరుసతోఁ గిన్నెరలు వాయించి ఇండ్లకువచ్చి
ఇరవై మనలగూడె నిట్టె ముద్దుఁ గృష్ణుఁడు
(||pallavi||)
kori viṁda viḍu rāre gŏllĕdalāla
merado mana kadam̐ḍu menamaram̐di
(||kori||)
āvula maṁdalalona nadĕ pillam̐duru lūdī
sevamīre veḍugadom̐ jinni kṛṣhṇum̐ḍu
pūvuladom̐ṭalona pŏṁchi gŏbbiḽlam̐ bāḍīni
vevelu saṁdāladoḍa vĕnnamudda kṛṣhṇum̐ḍu
(||kori||)
rachchagŏṭṭālalo nuṁḍi rāgāna nīlaluvĕṭṭī
gachchulu seyusu koḍĕgām̐ḍu kṛṣhṇum̐ḍu
tachchi nīlāḍirevula tagili sannalu sesī
pachchimām̐ṭa lāḍugŏṁṭā bālakṛṣhṇum̐ḍu
(||kori||)
dŏragŏni yamunalo tutturum̐gŏmmu vaṭṭīni
arudugā śhrī veṁkaḍedri kṛṣhṇum̐ḍu
varusadom̐ ginnĕralu vāyiṁchi iṁḍlaguvachchi
iravai manalagūḍĕ niṭṭĕ muddum̐ gṛṣhṇum̐ḍu