Kori neebaim dolli naagum goba munnadaa

కోరి నీపైఁ దొల్లి నాకుఁ గోప మున్నదా
Language

(॥పల్లవి॥)
కోరి నీపైఁ దొల్లి నాకుఁ గోప మున్నదా
ఆ రీతి ఱట్టు సేయఁగా నంటి నింతేగాక

(॥॥)
ఆనలేల పెట్టేవు అంత వేఁడుకొననేల
కానీవయ్యా నీమాఁటకుఁ గాదనేమా
నేనిట్టె మాటాడఁగాను నేరుపుతో నాపె చేతి-
కాను కందుకొనఁగాను కసరితిఁగాక

(॥॥)
కొప్పుదువ్వి యెంత నన్ను కొస రొడఁబరచేవు
చెప్పినట్టెల్లా నీకుఁ జేయకుండేనా
యిప్పుడు నావద్ద నుండి యెలమి నాపెమట్టెల-
చప్పు డాలకించఁగాను జరసితిఁగాక

(॥॥)
వీడె మిచ్చి చేయి నాపై వేసేవు శ్రీవెంకటేశ
కూడితి విందులకు నియ్యకొనవలదా
జాడతోడ నన్నేలి సంగడినున్నాపె మోము
చూడఁగా నందుకు నిట్టె సొలసితిఁగాక

(||pallavi||)
kori nībaim̐ dŏlli nāgum̐ goba munnadā
ā rīdi ṟaṭṭu seyam̐gā naṁṭi niṁtegāga

(||||)
ānalela pĕṭṭevu aṁta vem̐ḍugŏnanela
kānīvayyā nīmām̐ṭagum̐ gādanemā
neniṭṭĕ māḍāḍam̐gānu nerubudo nābĕ sedi-
kānu kaṁdugŏnam̐gānu kasaridim̐gāga

(||||)
kŏppuduvvi yĕṁta nannu kŏsa rŏḍam̐barasevu
sĕppinaṭṭĕllā nīgum̐ jeyaguṁḍenā
yippuḍu nāvadda nuṁḍi yĕlami nābĕmaṭṭĕla-
sappu ḍālagiṁcham̐gānu jarasidim̐gāga

(||||)
vīḍĕ michchi seyi nābai vesevu śhrīvĕṁkaḍeśha
kūḍidi viṁdulagu niyyagŏnavaladā
jāḍadoḍa nanneli saṁgaḍinunnābĕ momu
sūḍam̐gā naṁdugu niṭṭĕ sŏlasidim̐gāga