కూచుండవే ఇంకా వట్టిగట్టు లేఁటికి
(॥పల్లవి॥)
కూచుండవే ఇంకా వట్టిగట్టు లేఁటికి
వాచవులు మరిగిన వలపులు మానీనా
(॥కూచుం॥)
చనుఁగవ గప్పకువే సకియా మన-
మనసులలోనికి మఱఁగున్నదా
తనిసి నీనవ్వేల దాఁచేవే
కనుగొన నెమ్మోముకళలు దాగీనా
(॥కూచుం॥)
మాటలేల మొఱఁగేవే మగువా మన-
మూఁటల ఆసలలోన మొఱఁగున్నదా
చీటికిమాఁటికి నేల చేయి దీసేవే
కూటపురతిఁ జేయి దీసుకొనవచ్చునటవే
(॥కూచుం॥)
కూడితివేల నించేవే గుఱుతులు మన-
కోడె వయసులకును గుఱియున్నదా
యీడుగల శ్రీవేంకటేశుఁడఁ గదే
యీడుజోడు మనకంటే నిఁక మఱి వున్నదా
(||pallavi||)
kūsuṁḍave iṁkā vaṭṭigaṭṭu lem̐ṭigi
vāsavulu marigina valabulu mānīnā
(||kūsuṁ||)
sanum̐gava gappaguve sagiyā mana-
manasulalonigi maṟam̐gunnadā
tanisi nīnavvela dām̐seve
kanugŏna nĕmmomugaḽalu dāgīnā
(||kūsuṁ||)
māḍalela mŏṟam̐geve maguvā mana-
mūm̐ṭala āsalalona mŏṟam̐gunnadā
sīḍigimām̐ṭigi nela seyi dīseve
kūḍaburadim̐ jeyi dīsugŏnavachchunaḍave
(||kūsuṁ||)
kūḍidivela niṁcheve guṟudulu mana-
koḍĕ vayasulagunu guṟiyunnadā
yīḍugala śhrīveṁkaḍeśhum̐ḍam̐ gade
yīḍujoḍu managaṁṭe nim̐ka maṟi vunnadā