కూరిమి నెక్కవయ్య నా కుచదుర్గాలు
(॥పల్లవి॥)
కూరిమి నెక్కవయ్య నా కుచదుర్గాలు
యేరీతినైనా వారి నేమనఁగఁగలవు
(॥కూరి॥)
యేతలచూచినా సతులెందరై నా నుండఁగాను
నాతోనే సారెసారె నవ్వు నవ్వేవు
కాతరించి వారెల్లానొక్కటై దొమ్మి సేసితేను
యేతులు మెరసి నీవు యేమనఁగఁగగలవు
(॥కూరి॥)
కుచ్చినట్టు యిందరూ నీకొలువు సేయఁగాను
మచ్చికసేసి నాతోడనే మాటలాడేవు
పచ్చిగా నందరు నిన్ను బలిమిఁబై కొంటేను
హెచ్చి నీవింతటిలోన యేమనఁగఁగలవు
(॥కూరి॥)
కుచ్చినట్లు యిందరూ నీకొలువు సేయఁగాను
మచ్చికసేసి నాతోడనే మాటలాడేవు
పచ్చిగానందరు నిన్ను బలిమిఁబైకొంటేను
హెచ్చి నీవింతటిలోన యేమనఁగఁగలవు
(||pallavi||)
kūrimi nĕkkavayya nā kusadurgālu
yerīdinainā vāri nemanam̐gam̐galavu
(||kūri||)
yedalasūsinā sadulĕṁdarai nā nuṁḍam̐gānu
nādone sārĕsārĕ navvu navvevu
kādariṁchi vārĕllānŏkkaḍai dŏmmi sesidenu
yedulu mĕrasi nīvu yemanam̐gam̐gagalavu
(||kūri||)
kuchchinaṭṭu yiṁdarū nīgŏluvu seyam̐gānu
machchigasesi nādoḍane māḍalāḍevu
pachchigā naṁdaru ninnu balimim̐bai kŏṁṭenu
hĕchchi nīviṁtaḍilona yemanam̐gam̐galavu
(||kūri||)
kuchchinaṭlu yiṁdarū nīgŏluvu seyam̐gānu
machchigasesi nādoḍane māḍalāḍevu
pachchigānaṁdaru ninnu balimim̐baigŏṁṭenu
hĕchchi nīviṁtaḍilona yemanam̐gam̐galavu