Koodinavela gunamu kottalaayanu

కూడినవేళ గుణము కొత్తలాయను
Language

(॥పల్లవి॥)
కూడినవేళ గుణము కొత్తలాయను
వేడుక వెదచల్లితే వెరగాయ నీకు

(॥కూడి॥)
చాయల నాపెకు నీకు జగడము దిద్ది నేను
నాయముచెప్పితే నేఁడు నవ్వులాయను
కాయజ కేలిని నీవు కళదాఁకి చొక్కఁగాను
చేయివట్టి తీసితేను సిగ్గులాయ నీకు

(॥కూడి॥)
వున్నతి మీరిడుకొన్న వొట్లు వద్దని నేను
విన్నవించి మొక్కితేను వింతలాయను
కన్నెపాయపుమదాన కడు వెరగందఁగాను
సన్నలనే మెచ్చితేఁ దచ్చనలాయ నీకు

(॥కూడి॥)
మిమ్ముఁ జాయలకుఁ దెచ్చి మెరయఁ గూడించితేను
సమ్మతి శ్రీ వేంకటేశ చవులాయను
ఇమ్ముల నన్నేలితివి ఇంతలోనే వలపులు
కుమ్మరించితే రతులు గురులాయ నీకు

(||pallavi||)
kūḍinaveḽa guṇamu kŏttalāyanu
veḍuga vĕdasallide vĕragāya nīgu

(||kūḍi||)
sāyala nābĕgu nīgu jagaḍamu diddi nenu
nāyamusĕppide nem̐ḍu navvulāyanu
kāyaja kelini nīvu kaḽadām̐ki sŏkkam̐gānu
seyivaṭṭi tīsidenu siggulāya nīgu

(||kūḍi||)
vunnadi mīriḍugŏnna vŏṭlu vaddani nenu
vinnaviṁchi mŏkkidenu viṁtalāyanu
kannĕbāyabumadāna kaḍu vĕragaṁdam̐gānu
sannalane mĕchchidem̐ dachchanalāya nīgu

(||kūḍi||)
mimmum̐ jāyalagum̐ dĕchchi mĕrayam̐ gūḍiṁchidenu
sammadi śhrī veṁkaḍeśha savulāyanu
immula nannelidivi iṁtalone valabulu
kummariṁchide radulu gurulāya nīgu