Komta nilubamgaraadu komchevu vokkamaare

కొంత నిలుపఁగరాదు కొంచేవు వొక్కమారే
Language

(॥పల్లవి॥)
కొంత నిలుపఁగరాదు కొంచేవు వొక్కమారే
యిఁ(యిం?)తాఁ దీరిన మరి యేమిసేసేవే

(॥కొంత॥)
కొప్పు వీడినదాఁకా కుచము లదరుదాఁకా
యిప్పుడే అంత నీవు యేలనవ్వేవే
రెప్పలణఁచినదాఁకా రేవులురేవులుగాను
అప్పటిఁ దప్పక నన్ను అదేల చూచేవే

(॥కొంత॥)
పెదవు లెండినదాఁకా చెదరేయేలుఁగుదాఁకా
మదముదొలఁక నేల మాఁటలాడేవే
నిదుర ముంచినదాఁకా నివ్వెరగందినదాఁకా
సదమదమై యేల సరసమాడేవే

(॥కొంత॥)
నిండాఁ జెమరించుదాఁకా నిట్టూర్పు రేఁగిఁనదాఁకా
అండనే రతులనేల అలఇంచేవే
పండినశ్రీవేంకటాద్రిపతి నేనే కూడితిని
పండే మంచ మెక్కేదాఁకా పదరనేమిటికే

(||pallavi||)
kŏṁta nilubam̐garādu kŏṁchevu vŏkkamāre
yim̐(yiṁ?)tām̐ dīrina mari yemiseseve

(||kŏṁta||)
kŏppu vīḍinadām̐kā kusamu ladarudām̐kā
yippuḍe aṁta nīvu yelanavveve
rĕppalaṇam̐sinadām̐kā revulurevulugānu
appaḍim̐ dappaga nannu adela sūseve

(||kŏṁta||)
pĕdavu lĕṁḍinadām̐kā sĕdareyelum̐gudām̐kā
madamudŏlam̐ka nela mām̐ṭalāḍeve
nidura muṁchinadām̐kā nivvĕragaṁdinadām̐kā
sadamadamai yela sarasamāḍeve

(||kŏṁta||)
niṁḍām̐ jĕmariṁchudām̐kā niṭṭūrbu rem̐gim̐nadām̐kā
aṁḍane radulanela ala̮iṁcheve
paṁḍinaśhrīveṁkaḍādribadi nene kūḍidini
paṁḍe maṁcha mĕkkedām̐kā padaranemiḍige