కొమ్మలిద్దరు నుండఁగాఁ గొంకీఁగాని
(॥పల్లవి॥)
కొమ్మలిద్దరు నుండఁగాఁ గొంకీఁగాని
చిమ్ముఁజూపులతో లాచీ నిదె నీయెదుట
(॥కొమ్మ॥)
వేడుకైనసుద్ది నీతో విన్నవించ సిగ్గువడీ-
నాడ నాకె నానవెట్టి యడుగవయ్యా
బేడుకోలుఁదనమున పెండ్లి మాట గాఁబోలు
చూడు ముసిముసినవ్వు చూపీ నీయెదుట
(॥కొమ్మ॥)
కలికి మాటుననుండి కానుకలియ్య సిగ్గువడీ
తిలకించి చేయిచాఁచి తీసుకోవయ్యా
అలనాఁ డేమంటివో నేఁ డాపనికిగాఁబోలు
తెలుసుకో లాలించితే తెలిపీ నీయెదుట
(॥కొమ్మ॥)
ముందర నీకు నిలిచి మొక్కుతానే సిగ్గువడీ -
నందుకుఁ గాఁగిట నీవు నలమవయ్యా
విందువలె నన్నును శ్రీవేంకటేశ కూడితివి
అందుకో విడెము నీకు నందిఇచ్చీ యెదట
(||pallavi||)
kŏmmaliddaru nuṁḍam̐gām̐ gŏṁkīm̐gāni
simmum̐jūbulado lāsī nidĕ nīyĕduḍa
(||kŏmma||)
veḍugainasuddi nīdo vinnaviṁcha sigguvaḍī-
nāḍa nāgĕ nānavĕṭṭi yaḍugavayyā
beḍugolum̐danamuna pĕṁḍli māḍa gām̐bolu
sūḍu musimusinavvu sūbī nīyĕduḍa
(||kŏmma||)
kaligi māḍunanuṁḍi kānugaliyya sigguvaḍī
tilagiṁchi seyisām̐si tīsugovayyā
alanām̐ ḍemaṁṭivo nem̐ ḍābanigigām̐bolu
tĕlusugo lāliṁchide tĕlibī nīyĕduḍa
(||kŏmma||)
muṁdara nīgu nilisi mŏkkudāne sigguvaḍī -
naṁdugum̐ gām̐giḍa nīvu nalamavayyā
viṁduvalĕ nannunu śhrīveṁkaḍeśha kūḍidivi
aṁdugo viḍĕmu nīgu naṁdiichchī yĕdaḍa