కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్
పల్లవి:
కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తోంది
ఏవమ్మా మరుమల్లీ తోరణాలు కడతావా
చిలకమ్మా ఎదురేగీ స్వాగతాలు చెబుతావా
పూల పొదరిల్లే రా ..రామ్మన్నది
విన్నానమ్మా తీయని వేణువు రమ్మను పిలుపుల్నీ
చూశానమ్మా స్వాగతమంటూ తెరిచిన తలుపులనీ
చరణం 1:
పగలూ రాత్రి అంటూ తేడా లేనేలేని పసిపాప నవ్వుల్ని చూడనీ
తోడూ నీడా నువ్వై నాతో నడిచే నీకు ఏనాటి ఋణముందో అడగనీ
చేదు చేదు కలలన్నీ కరిగితేనె వరదవనీ
కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని
ప్రతిజన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్లని !
కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది
విన్నానమ్మా తీయని వేణువు రమ్మను పిలుపుల్నీ
చరణం 2:
ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి
నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి ఈ జన్మకి
మచ్చలేని చంద్రుడిని మాటరాక చూస్తున్నా
వరసకాని బంధువుని చొరవచేసి అంటున్నా
ఇంకెప్పుడూ ఒంటరినని అనరాదని... నీకు సొంతం అంటే నేనే అనీ.. !!
కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తోంది
ఏవమ్మా మరుమల్లీ తోరణాలు కడతావా
చిలకమ్మా ఎదురేగీ స్వాగతాలు చెబుతావా
పూల పొదరిల్లే రా ..రామ్మన్నది
విన్నానమ్మా తీయని వేణువు రమ్మను పిలుపుల్నీ
చూశానమ్మా స్వాగతమంటూ తెరిచిన తలుపులనీ....
pallavi:
kŏmmā kŏmmā vinnāvammā koyila vastoṁdi
vastū vastū tanado vĕnnĕla vĕlugulu tĕstoṁdi
evammā marumallī toraṇālu kaḍadāvā
silagammā ĕduregī svāgadālu sĕbudāvā
pūla pŏdarille rā ..rāmmannadi
vinnānammā tīyani veṇuvu rammanu pilubulnī
sūśhānammā svāgadamaṁṭū tĕrisina talubulanī
saraṇaṁ 1:
pagalū rātri aṁṭū teḍā leneleni pasibāba navvulni sūḍanī
toḍū nīḍā nuvvai nādo naḍise nīgu enāḍi ṛṇamuṁdo aḍaganī
sedu sedu kalalannī karigidenĕ varadavanī
kānugaina snehānni guṁḍĕlona dāsuguni
pradijanmagi ī nestame kāvālani koruguṁṭānammā devuḽlani !
kŏmmā kŏmmā vinnāvammā koyila vastoṁdi
vinnānammā tīyani veṇuvu rammanu pilubulnī
saraṇaṁ 2:
idigo ninne aṁṭū preme ĕdurai vaste e pūlu tevāli pūjagi
nīdo jadagā uṁḍe varame nuvve iste iṁkemi kāvāli ī janmagi
machchaleni saṁdruḍini māḍarāga sūstunnā
varasagāni baṁdhuvuni sŏravasesi aṁṭunnā
iṁkĕppuḍū ŏṁṭarinani anarādani... nīgu sŏṁtaṁ aṁṭe nene anī.. !!
kŏmmā kŏmmā vinnāvammā koyila vastoṁdi
vastū vastū tanado vĕnnĕla vĕlugulu tĕstoṁdi
evammā marumallī toraṇālu kaḍadāvā
silagammā ĕduregī svāgadālu sĕbudāvā
pūla pŏdarille rā ..rāmmannadi
vinnānammā tīyani veṇuvu rammanu pilubulnī
sūśhānammā svāgadamaṁṭū tĕrisina talubulanī....