Komma neesakkamdanamu kodi sesunu

కొమ్మ నీచక్కఁదనము కోటి సేసును
Language

(॥పల్లవి॥)
కొమ్మ నీచక్కఁదనము కోటి సేసును
ఇమ్ముల నీపతిభాగ్య మెంతని చెప్పేదే

(॥॥)
సెలవి నవ్విననవ్వు చెక్కిటఁ బెట్టినచెయ్యి
చెలి నీమొగమునకు సింగారమాయ
తిలకించి చూచేచూపు తేనెగారే మోవిమాట
కలికితనాల కెల్లా కందువలై తోఁచెను

(॥॥)
మొనచన్నుల కదలు మొగిఁ గమ్మలతళుకు
వనిత నీవయసుకు వన్నెవచ్చెను
పొనుగులేఁత సిగ్గులు బొమ్మముడి జంకెనలు
తనివోనియాసలకుఁ దగినగురుతులు

(॥॥)
బలుపిరుఁదులసొంపు పాదపుమట్టెలరొద
అలమేల్మంగ నీరతి కడియాలము
లలి శ్రీ వేంకటేశుఁ గలయు నీచేతులగోళ్లఁ
దలకొన్నరాఁకులు తారుకాణలు

(||pallavi||)
kŏmma nīsakkam̐danamu koḍi sesunu
immula nībadibhāgya mĕṁtani sĕppede

(||||)
sĕlavi navvinanavvu sĕkkiḍam̐ bĕṭṭinasĕyyi
sĕli nīmŏgamunagu siṁgāramāya
tilagiṁchi sūsesūbu tenĕgāre movimāḍa
kaligidanāla kĕllā kaṁduvalai tom̐sĕnu

(||||)
mŏnasannula kadalu mŏgim̐ gammaladaḽugu
vanida nīvayasugu vannĕvachchĕnu
pŏnugulem̐ta siggulu bŏmmamuḍi jaṁkĕnalu
tanivoniyāsalagum̐ daginagurudulu

(||||)
balubirum̐dulasŏṁpu pādabumaṭṭĕlarŏda
alamelmaṁga nīradi kaḍiyālamu
lali śhrī veṁkaḍeśhum̐ galayu nīsedulagoḽlam̐
dalagŏnnarām̐kulu tārugāṇalu