Komkanela neevimta kori sigguvadanela

కొంకనేల నీవింత కోరి సిగ్గువడనేల
Language

(॥పల్లవి॥)
కొంకనేల నీవింత కోరి సిగ్గువడనేల
సంకెదీరె నీతోడ చలము లేదయ్యా

(॥కొంక॥)
మనసొక్కటైతేఁ జాలు మాఁటలు వేరు తోఁచవు
అనుమానమేల మాతో నానతీవయ్యా
యెనయికలు గలిగితే నెరవు లించుకా లేవు
కొనమొద లెంచనేల కూచుండవయ్యా

(॥కొంక॥)
యితవులైన చోట నెగ్గులుసిగ్గు లుండవు
చతురతల వలపు చల్లవయ్యా
పతి తారుకాణలైతే పట్టినదెల్లా నిజము
రతికెక్కెఁ బనులెల్లా రావయ్యా లోనికి

(॥కొంక॥)
సమ్మతించినందుకెల్లా సరసములే మించు
నమ్మించితి విట్టే మాతో నవ్వవయ్యా
యిమ్ముల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యెమ్మెలేల నీమోవి యియ్యవయ్యా

(||pallavi||)
kŏṁkanela nīviṁta kori sigguvaḍanela
saṁkĕdīrĕ nīdoḍa salamu ledayyā

(||kŏṁka||)
manasŏkkaḍaidem̐ jālu mām̐ṭalu veru tom̐savu
anumānamela mādo nānadīvayyā
yĕnayigalu galigide nĕravu liṁchugā levu
kŏnamŏda lĕṁchanela kūsuṁḍavayyā

(||kŏṁka||)
yidavulaina soḍa nĕggulusiggu luṁḍavu
saduradala valabu sallavayyā
padi tārugāṇalaide paṭṭinadĕllā nijamu
radigĕkkĕm̐ banulĕllā rāvayyā lonigi

(||kŏṁka||)
sammadiṁchinaṁdugĕllā sarasamule miṁchu
nammiṁchidi viṭṭe mādo navvavayyā
yimmula śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
yĕmmĕlela nīmovi yiyyavayyā