Komkaguve yimkam gomali

కొంకకువే యిఁకఁ గోమలి
Language

(॥పల్లవి॥)
కొంకకువే యిఁకఁ గోమలి
పొంకమయినట్లఁ బొసఁగీఁగాని

(॥కొంక॥)
ధరలోపల మతి తమకము గలిగిన
సరసపుమాటలు చౌలౌను
వొరసి చూడవే వోపిక గలిగిన
వరుసకు రమణుడు వచ్చీఁగాని

(॥కొంక॥)
మునుకొని పైపై మోహము గలిగిన
చనవులు మనవులు చవులౌను
పెనఁగవె వొకపరి ప్రియము గలిగితే
చొనిపి విభుఁడు దయఁజూచీఁగాని

(॥కొంక॥)
సేవసేయఁగా చిత్రము గరఁగిన
యేవేళ రతులు యితవౌను
వాని దెలుపఁగా వచ్చి నన్నెనసె
శ్రీవేంకటేశుఁడుచెలఁగీఁగాని

(||pallavi||)
kŏṁkaguve yim̐kam̐ gomali
pŏṁkamayinaṭlam̐ bŏsam̐gīm̐gāni

(||kŏṁka||)
dharalobala madi tamagamu galigina
sarasabumāḍalu saulaunu
vŏrasi sūḍave vobiga galigina
varusagu ramaṇuḍu vachchīm̐gāni

(||kŏṁka||)
munugŏni paibai mohamu galigina
sanavulu manavulu savulaunu
pĕnam̐gavĕ vŏgabari priyamu galigide
sŏnibi vibhum̐ḍu dayam̐jūsīm̐gāni

(||kŏṁka||)
sevaseyam̐gā sitramu garam̐gina
yeveḽa radulu yidavaunu
vāni dĕlubam̐gā vachchi nannĕnasĕ
śhrīveṁkaḍeśhum̐ḍusĕlam̐gīm̐gāni