Komkaga seppave yee kottalu vinemgaani

కొంకక చెప్పవే యీ కొత్తలు వినేఁగాని
Language

(॥పల్లవి॥)
కొంకక చెప్పవే యీ కొత్తలు వినేఁగాని
లంకెగా నితఁడు నీకు లలిఁ జుట్టమటవే

(॥కొంక॥)
తగిలి తగిలి నీవు తప్పకిట్టె చూచేవు
మగువరో నీకితఁడు మగఁడటవే
నగుతా నప్పటి నీవు నంటుఁ గడు నెరపేవు
పగటున నీకు మేనబావ యటవే

(॥కొంక॥)
సంకెలేక యితనితో సారెకు మాఁటలాడేవు
కంకణము గట్టినట్టి కాంతుఁడటవే
అంకె నేపొద్దూ నీతని యండనే కూచుండేవు
బింకము తోడుత నీపెండ్లికొడుకటవే

(॥కొంక॥)
సంతతము నీతనితో జాణతనాలే యాడేవు
మంతుకెక్క నీతఁడు మరవియటవే
యింతట శ్రీవేంకటేశుఁ డేనలమేలుమంగను
వింతగా నన్నేలె నీకూ విభుఁడటవే

(||pallavi||)
kŏṁkaga sĕppave yī kŏttalu vinem̐gāni
laṁkĕgā nidam̐ḍu nīgu lalim̐ juṭṭamaḍave

(||kŏṁka||)
tagili tagili nīvu tappagiṭṭĕ sūsevu
maguvaro nīgidam̐ḍu magam̐ḍaḍave
nagudā nappaḍi nīvu naṁṭum̐ gaḍu nĕrabevu
pagaḍuna nīgu menabāva yaḍave

(||kŏṁka||)
saṁkĕlega yidanido sārĕgu mām̐ṭalāḍevu
kaṁkaṇamu gaṭṭinaṭṭi kāṁtum̐ḍaḍave
aṁkĕ nebŏddū nīdani yaṁḍane kūsuṁḍevu
biṁkamu toḍuda nībĕṁḍligŏḍugaḍave

(||kŏṁka||)
saṁtadamu nīdanido jāṇadanāle yāḍevu
maṁtugĕkka nīdam̐ḍu maraviyaḍave
yiṁtaḍa śhrīveṁkaḍeśhum̐ ḍenalamelumaṁganu
viṁtagā nannelĕ nīgū vibhum̐ḍaḍave