కొంగువట్ట కంత నీవు గొల్లబోయిఁడా
(॥పల్లవి॥)
కొంగువట్ట కంత నీవు గొల్లబోయిఁడా
కుంగక నీకు మొక్కేము గొల్లబోయిఁడా
(॥కొంగు॥)
పొలసు మాటలగొల్లబోయిఁడా నీ-
కొలము దాఁచకువోయి గొల్లబోయిఁడా
పొలము మేపకు గొల్లబొయిఁడా
కొలువుకంబముచాటుగొల్లబోయిఁడా
(॥కొంగు॥)
పొడవాటికాళ గొల్లబోయిఁడా
గొడవలు మానవోఇ గొల్లబోయిఁడా
పొడలమెకముగొల్లబోయిఁడా
గొడగెత్తియాలఁ గాచే గొల్లబోయిఁడా
(॥కొంగు॥)
బుద్దులగొలవు గొల్లబోయిఁడా
కొద్దిలేనిదాఁటులగొల్లబోయిఁడా
మద్దులశ్రీవేంకటాద్రి మందబోఇయఁడా నీకు
గుద్దే బాదాలు నే గొల్లబోఇఁడా
(||pallavi||)
kŏṁguvaṭṭa kaṁta nīvu gŏllaboyim̐ḍā
kuṁgaga nīgu mŏkkemu gŏllaboyim̐ḍā
(||kŏṁgu||)
pŏlasu māḍalagŏllaboyim̐ḍā nī-
kŏlamu dām̐saguvoyi gŏllaboyim̐ḍā
pŏlamu mebagu gŏllabŏyim̐ḍā
kŏluvugaṁbamusāḍugŏllaboyim̐ḍā
(||kŏṁgu||)
pŏḍavāḍigāḽa gŏllaboyim̐ḍā
gŏḍavalu mānavoi gŏllaboyim̐ḍā
pŏḍalamĕgamugŏllaboyim̐ḍā
gŏḍagĕttiyālam̐ gāse gŏllaboyim̐ḍā
(||kŏṁgu||)
buddulagŏlavu gŏllaboyim̐ḍā
kŏddilenidām̐ṭulagŏllaboyim̐ḍā
maddulaśhrīveṁkaḍādri maṁdaboiyam̐ḍā nīgu
gudde bādālu ne gŏllaboim̐ḍā