కొండవంటిదొర దాను గోవిందరాజు । తన
(॥పల్లవి॥)
కొండవంటిదొర దాను గోవిందరాజు । తన-
గుండె రాఇగాదా తొల్లి గోవిందరాజు
(॥కొండ॥)
చేరి తనపాదాలు చేకొని పిసుకఁగానే
కూరిములు గొసరీని గోవిందరాజు
నేరుపుతోఁ జెప్పినట్టె నేము నిట్టెసేయఁగానే
గోరిచీని వలపలుగోవిందరాజు
(॥కొండ॥)
చప్పుడు గాకుండానుసరసములాడితేను
కుప్పళించీ పెంజెమటగోవిందరాజు
ముప్పిరిఁ జేతులెత్తి మొక్కఁగాను వచ్చిదేర
గొప్పగొప్ప మాటలాడీ గోవిందరాజు
(॥కొండ॥)
గరిమల నిద్దరముఁ గాఁగిలించుకొంటేను
కురిసీ మోవితేనెలు గోవిందరాజు
ఇరవై శ్రీవేంకటేశుఁ డీతఁడే నేము గూడితే
గొరబుసేసీఁ జన్నులు గోవిందరాజు
(||pallavi||)
kŏṁḍavaṁṭidŏra dānu goviṁdarāju | tana-
guṁḍĕ rāigādā tŏlli goviṁdarāju
(||kŏṁḍa||)
seri tanabādālu segŏni pisugam̐gāne
kūrimulu gŏsarīni goviṁdarāju
nerubudom̐ jĕppinaṭṭĕ nemu niṭṭĕseyam̐gāne
gorisīni valabalugoviṁdarāju
(||kŏṁḍa||)
sappuḍu gāguṁḍānusarasamulāḍidenu
kuppaḽiṁchī pĕṁjĕmaḍagoviṁdarāju
muppirim̐ jedulĕtti mŏkkam̐gānu vachchidera
gŏppagŏppa māḍalāḍī goviṁdarāju
(||kŏṁḍa||)
garimala niddaramum̐ gām̐giliṁchugŏṁṭenu
kurisī movidenĕlu goviṁdarāju
iravai śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nemu gūḍide
gŏrabusesīm̐ jannulu goviṁdarāju