కొండాకోనల్లో లోయ్యల్లో గోదారి గంగమ
పల్లవి:
కొండాకోనల్లో లోయ్యల్లో గోదారి గంగమ్మా సాయల్లో||2||
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మా ఈ కోయిలమ్మా
చరణం 1:
నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగా
నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వై మ్రోగంగా
ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊరంగా||2||
ఊపిరి ఊయల లూగంగా రేపటి ఆశలు తీరంగా
తెనుగుదనము నోరూరంగా తేటగీతి గారాబంగా||2||
తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా..
చరణం 2:
ఝుమ్మని తుమ్మెద తీయంగా కమ్మనీ రాగం తీయ్యంగా
జాజిమల్లి సంపెంగ జానపదాలే నింపంగా
కమ్మన్ని రాగం తీయ్యంగా జానపదాలే నింపంగా
చెట్టు పుట్ట నెయ్యంగా చెట్టాపట్టా లేయంగా||2||
చిలక పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
ఏటిపాట లాలించంగా తోటతల్లి లాలించంగా||2||
స్వరాలన్నీ దీవించంగా సావాసంగా
pallavi:
kŏṁḍāgonallo loyyallo godāri gaṁgammā sāyallo||2||
kori kori kūsiṁdi koyilamma
kori kori kūsiṁdi koyilammā ī koyilammā
saraṇaṁ 1:
nela pallavi pāḍaṁgā nīli mabbu āḍaṁgā
rivvuna guvve sāgaṁgā navve muvvai mrogaṁgā
nīli mabbu āḍaṁgā navve muvvai mrogaṁgā
uṁgā uṁgā rāgaṁgā ullāsāle ūraṁgā||2||
ūbiri ūyala lūgaṁgā rebaḍi āśhalu tīraṁgā
tĕnugudanamu norūraṁgā teḍagīdi gārābaṁgā||2||
tĕmmĕrabai ūregaṁgā vayyāraṁgā..
saraṇaṁ 2:
jhummani tummĕda tīyaṁgā kammanī rāgaṁ tīyyaṁgā
jājimalli saṁpĕṁga jānabadāle niṁpaṁgā
kammanni rāgaṁ tīyyaṁgā jānabadāle niṁpaṁgā
sĕṭṭu puṭṭa nĕyyaṁgā sĕṭṭābaṭṭā leyaṁgā||2||
silaga palugulu sitraṁgā silige tenĕlu sikkaṁgā
eḍibāḍa lāliṁchaṁgā toḍadalli lāliṁchaṁgā||2||
svarālannī dīviṁchaṁgā sāvāsaṁgā