కోమలిరో యింతులకు గుట్టు వలదా
(॥పల్లవి॥)
కోమలిరో యింతులకు గుట్టు వలదా
యేమే నవ్వులు నవ్వే విందరిలోనాను
(॥కోమ॥)
కాఁపురాలు సేసేవారు కలరుగాక నీవలె
చేపట్టి మన్నించెనంటాఁ జెప్పుకొందురా
యేపొదూఁ బాయకవుండి హెచ్చవలతురుగాక
పైపై వెల్లవిరిగాఁ బచ్చి సేసుకొందురా
(॥కోమ॥)
ఇల్లాండ్లయినవారు ఇంటిలో నుందురుగాక
పెల్లునఁ జేఁత లంగడిఁబెట్టుకొందురా
మెల్లనే సేవలుసేసి మెప్పించుకొందురుగాక
వల్లదాన గర్వములు పచారించుకొందురా
(॥కోమ॥)
తగులుగలుగువారు తతిఁ గూడుదురుగాక
మిగులా నీయెమ్మె లిట్టె మెరఇంతురా
జిగి నలమేల్ మంగయోఁచినశ్రీవేంకటేశుఁడు
తగ నన్ను నేలె నీమగఁడనుకొందురా
(||pallavi||)
komaliro yiṁtulagu guṭṭu valadā
yeme navvulu navve viṁdarilonānu
(||koma||)
kām̐purālu sesevāru kalarugāga nīvalĕ
sebaṭṭi manniṁchĕnaṁṭām̐ jĕppugŏṁdurā
yebŏdūm̐ bāyagavuṁḍi hĕchchavaladurugāga
paibai vĕllavirigām̐ bachchi sesugŏṁdurā
(||koma||)
illāṁḍlayinavāru iṁṭilo nuṁdurugāga
pĕllunam̐ jem̐ta laṁgaḍim̐bĕṭṭugŏṁdurā
mĕllane sevalusesi mĕppiṁchugŏṁdurugāga
valladāna garvamulu pasāriṁchugŏṁdurā
(||koma||)
tagulugaluguvāru tadim̐ gūḍudurugāga
migulā nīyĕmmĕ liṭṭĕ mĕra̮iṁturā
jigi nalamel maṁgayom̐sinaśhrīveṁkaḍeśhum̐ḍu
taga nannu nelĕ nīmagam̐ḍanugŏṁdurā