Koluvu sesevaaramu korada lemchamgalamaa

కొలువు సేసేవారము కొరత లెంచఁగలమా
Language

(॥పల్లవి॥)
కొలువు సేసేవారము కొరత లెంచఁగలమా
పిలుపు లిద్దరికి మీ పెదవుల నున్నవి

(॥కొలు॥)
చనుమొనలు దాఁకఁగ జవ్వాది నీ కాపె వూసె
కనుఁగొనలనే చొక్కి కరఁగితివి
చొనిపి మమ్మిఁక నేమిసుద్దులు నీ వడిగేవు
చెనకిచెనకులు చెక్కులపై నున్నవి

(॥కొలు॥)
సొమ్ము సొమ్ముతో రాయఁగ సురటి విసరీ నాపె
కిమ్ములఁ గరఁగి పులకించితివి
మమ్ముఁ జూచి సిగ్గువడ మరి యేమిటికి నీకు
చిమ్మేటినవ్వులు మీ సెలువుల నున్నవి

(॥కొలు॥)
పాదముఁబాదము దాఁకఁ బవ్వళించివున్నదాపె
యీదెసఁ గాఁగిట నీవు యెనసితివి
పోదిగా శ్రీవేంకటేశ పొందితివి మమ్ము నిట్టె
మోదపుఁగళలు మీమోములు నిండున్నవి

(||pallavi||)
kŏluvu sesevāramu kŏrada lĕṁcham̐galamā
pilubu liddarigi mī pĕdavula nunnavi

(||kŏlu||)
sanumŏnalu dām̐kam̐ga javvādi nī kābĕ vūsĕ
kanum̐gŏnalane sŏkki karam̐gidivi
sŏnibi mammim̐ka nemisuddulu nī vaḍigevu
sĕnagisĕnagulu sĕkkulabai nunnavi

(||kŏlu||)
sŏmmu sŏmmudo rāyam̐ga suraḍi visarī nābĕ
kimmulam̐ garam̐gi pulagiṁchidivi
mammum̐ jūsi sigguvaḍa mari yemiḍigi nīgu
simmeḍinavvulu mī sĕluvula nunnavi

(||kŏlu||)
pādamum̐bādamu dām̐kam̐ bavvaḽiṁchivunnadābĕ
yīdĕsam̐ gām̐giḍa nīvu yĕnasidivi
podigā śhrīveṁkaḍeśha pŏṁdidivi mammu niṭṭĕ
modabum̐gaḽalu mīmomulu niṁḍunnavi