కోడెకత్తెవు కొమ్మ నీకు నేఁ జెప్పితి
(॥పల్లవి॥)
కోడెకత్తెవు కొమ్మ నీకు నేఁ జెప్పితి
రూడితో నీచేఁతలే నేరుచుకోవే చెలియా
(॥కొడె॥)
చుట్టరికము గలితే సొలయఁగవచ్చును
యెట్టనెదుల నుండితే నింపువుట్టును
గట్టిగాఁ బొందుసేసితేఁ గాఁపురము లీడేరు
నెట్టుకొన్నబుద్దులివి నేర్చుకొవే చెలియా
(॥కొడె॥)
చనవు మిక్కుటమైతే సరసములు చెల్లును
మనసు లేకములైతే మాట లింపౌను
ననుపులు దొరకితే నాటుకొనుఁ బ్రియములు
యేనసేటినీతు లివి యెంచుకొవే చెలి యా
(॥కొడె॥)
చేరి చెనకఁ జోచ్చితే సెలవుల నవ్వు మించు
కోరినట్టే వచ్చితేను గూడఁగఁదగు
యీరీతి శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్నునేలె
పేరడిగుణా లివి పెంచుకొవే చెలియా
(||pallavi||)
koḍĕgattĕvu kŏmma nīgu nem̐ jĕppidi
rūḍido nīsem̐tale nerusugove sĕliyā
(||kŏḍĕ||)
suṭṭarigamu galide sŏlayam̐gavachchunu
yĕṭṭanĕdula nuṁḍide niṁpuvuṭṭunu
gaṭṭigām̐ bŏṁdusesidem̐ gām̐puramu līḍeru
nĕṭṭugŏnnabuddulivi nersugŏve sĕliyā
(||kŏḍĕ||)
sanavu mikkuḍamaide sarasamulu sĕllunu
manasu legamulaide māḍa liṁpaunu
nanubulu dŏragide nāḍugŏnum̐ briyamulu
yenaseḍinīdu livi yĕṁchugŏve sĕli yā
(||kŏḍĕ||)
seri sĕnagam̐ jochchide sĕlavula navvu miṁchu
korinaṭṭe vachchidenu gūḍam̐gam̐dagu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnunelĕ
peraḍiguṇā livi pĕṁchugŏve sĕliyā