Kodee baavagu pellamta

కోతీ బావకు పెళ్ళంట
Work
Year
Language

పల్లవి:

ఓ..ఓ
కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా, కోవెలతోట విడిదంట
కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా, కోవెలతోట విడిదంట
మల్లీ మాలతి వస్తారా మాలికలల్లి తెస్తారా
బంతి జాజి చేమంతి బంతులు కట్టి తెస్తారా బంతులు కట్టి తెస్తారా

చరణం 1:

పెళ్ళికి మీరు వస్తారా? పేరంటానికి వస్తారా?
పందిరి వేస్తాము.. ముందర ముగ్గులు పెడతాము
పందిరి కింద పెళ్ళివారికి విందులు చేస్తాము, బాగా విందులు చేస్తాము
బాకా బాజా డోలూ సన్నాయ్ ..బాకా బాజా డోలూ సన్నాయ్
..బాకా బాజా డోలూ సన్నాయ్
మేళాలెడతారు తప్పెట తాళాలెడతారు... తప్పెట తాళాలెడతారు

కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా, కోవెలతోట విడిదంట

చరణం 2:

అందాలా మా బావగారికి గంధాలు పూసి
ఓ..గారాల మా బావ మెడలో హారాలు వేసి
కుళ్ళాయెడతాము... పుత్తుల తురాయి పెడతాము
హారాలేసీ.. గంధం పూసీ... కుళ్ళేయేసి తురాయి పెడతాము
పుత్తుల తురాయి పెడతాము
ఓ..పల్లకి యెక్కి ...
పల్లకి యెక్కి కోతీ బావా పళ్ళికిలిస్తాడు
బావా పళ్ళికిలిస్తాడు...
మా కోతీ బావా పళ్ళికిలిస్తాడు!

కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట

pallavi:

o..o
kodī bāvagu pĕḽḽaṁṭā.. kovĕla toḍa viḍidaṁṭā, kovĕladoḍa viḍidaṁṭa
kodī bāvagu pĕḽḽaṁṭā.. kovĕla toḍa viḍidaṁṭā, kovĕladoḍa viḍidaṁṭa
mallī māladi vastārā māligalalli tĕstārā
baṁti jāji semaṁti baṁtulu kaṭṭi tĕstārā baṁtulu kaṭṭi tĕstārā

saraṇaṁ 1:

pĕḽḽigi mīru vastārā? peraṁṭānigi vastārā?
paṁdiri vestāmu.. muṁdara muggulu pĕḍadāmu
paṁdiri kiṁda pĕḽḽivārigi viṁdulu sestāmu, bāgā viṁdulu sestāmu
bāgā bājā ḍolū sannāy ..bāgā bājā ḍolū sannāy
..bāgā bājā ḍolū sannāy
meḽālĕḍadāru tappĕḍa tāḽālĕḍadāru... tappĕḍa tāḽālĕḍadāru

kodī bāvagu pĕḽḽaṁṭā.. kovĕla toḍa viḍidaṁṭā, kovĕladoḍa viḍidaṁṭa

saraṇaṁ 2:

aṁdālā mā bāvagārigi gaṁdhālu pūsi
o..gārāla mā bāva mĕḍalo hārālu vesi
kuḽḽāyĕḍadāmu... puttula turāyi pĕḍadāmu
hārālesī.. gaṁdhaṁ pūsī... kuḽḽeyesi turāyi pĕḍadāmu
puttula turāyi pĕḍadāmu
o..pallagi yĕkki ...
pallagi yĕkki kodī bāvā paḽḽigilistāḍu
bāvā paḽḽigilistāḍu...
mā kodī bāvā paḽḽigilistāḍu!

kodī bāvagu pĕḽḽaṁṭā.. kovĕla toḍa viḍidaṁṭā.. kovĕladoḍa viḍidaṁṭa