Kodadiruvemgalela kodegaamdaa

కోటతిరువెంగళేళ కోడెకాఁడా
Language

(॥పల్లవి॥)
కోటతిరువెంగళేళ కోడెకాఁడా
ఆనించీ నీసతి నీపై అప్పటి వలపులు

(॥కోట॥)
వేడుకకు నీతోను వేసారక మాటలాడి
వీడెము చేతికి నిచ్చి వెడ్డువెట్టీని
వాడికగా నీ సొమ్ము వడిఁ దనమేనఁ బెట్టి
తోడనే మోపులుగట్టీ తొయ్యలి వలపులు

(॥కోట॥)
చెక్కునొక్కి నవ్వించి చిత్తము రా సన్నసేసి
మొక్కు మొక్కి ఆసపుట్ట మోవి చూపీని
వొక్కమాఁటే నీకొప్పుపువ్వులు దా ముడుచుకొని
చిక్కించి నీపై రాసిచేసీ వలపులు

(॥కోట॥)
కొంగువట్టి కొసరుచు కూరిమి కాఁగిట నించి
సంగతిగాఁ గూడికూడి చల్లీ నేస
రంగుగ శ్రీవేంకటేశ రతిని గంద మలంది
పొంగుచును కణఁజాలఁ బోసీ వలపులు

(||pallavi||)
koḍadiruvĕṁgaḽeḽa koḍĕgām̐ḍā
āniṁchī nīsadi nībai appaḍi valabulu

(||koḍa||)
veḍugagu nīdonu vesāraga māḍalāḍi
vīḍĕmu sedigi nichchi vĕḍḍuvĕṭṭīni
vāḍigagā nī sŏmmu vaḍim̐ danamenam̐ bĕṭṭi
toḍane mobulugaṭṭī tŏyyali valabulu

(||koḍa||)
sĕkkunŏkki navviṁchi sittamu rā sannasesi
mŏkku mŏkki āsabuṭṭa movi sūbīni
vŏkkamām̐ṭe nīgŏppubuvvulu dā muḍusugŏni
sikkiṁchi nībai rāsisesī valabulu

(||koḍa||)
kŏṁguvaṭṭi kŏsarusu kūrimi kām̐giḍa niṁchi
saṁgadigām̐ gūḍigūḍi sallī nesa
raṁguga śhrīveṁkaḍeśha radini gaṁda malaṁdi
pŏṁgusunu kaṇam̐jālam̐ bosī valabulu