కోపముఁ దీరినమీఁదఁ గూడేఁగాని
(॥పల్లవి॥)
కోపముఁ దీరినమీఁదఁ గూడేఁగాని
యీ పొద్దు కెదిరిమెచ్చు కింత చాలురా
(॥కోప॥)
సెలవి నీవు నవ్వఁగా జేరి మేను నవ్వేఁగాని
అలరి నామతినైతే నలుకలేరా
నిలిచి నీవు చూడఁగా నేనూఁజూచితిఁగాని
బలు దొరవైన నీతో బాడి గాదునా
(॥కోప॥)
మాటలాడఁగా నీతో మాటలు నే నాడేఁగాని
మాటి మాటికి నాకు సమ్మతిగాదురా
కూటమిఁ బిలువగా నే గుట్టున నూఁకొంటిఁగాని
యీటునఁ గూడినదాఁకా యెరెరవేరా
(॥కోప॥)
కాఁగిలించఁగా నిన్నుఁ గాఁగిలించేఁగాని నేను
కాఁగిన నామేనిమీఁదికాఁక చూడరా
దాఁగక శ్రీవేంకటేశ తలఁపులో చింతవాసె
ఆఁగిన నీరతిలోన నలసితిరా
(||pallavi||)
kobamum̐ dīrinamīm̐dam̐ gūḍem̐gāni
yī pŏddu kĕdirimĕchchu kiṁta sālurā
(||koba||)
sĕlavi nīvu navvam̐gā jeri menu navvem̐gāni
alari nāmadinaide nalugalerā
nilisi nīvu sūḍam̐gā nenūm̐jūsidim̐gāni
balu dŏravaina nīdo bāḍi gādunā
(||koba||)
māḍalāḍam̐gā nīdo māḍalu ne nāḍem̐gāni
māḍi māḍigi nāgu sammadigādurā
kūḍamim̐ biluvagā ne guṭṭuna nūm̐kŏṁṭim̐gāni
yīḍunam̐ gūḍinadām̐kā yĕrĕraverā
(||koba||)
kām̐giliṁcham̐gā ninnum̐ gām̐giliṁchem̐gāni nenu
kām̐gina nāmenimīm̐digām̐ka sūḍarā
dām̐gaga śhrīveṁkaḍeśha talam̐pulo siṁtavāsĕ
ām̐gina nīradilona nalasidirā