Koba mimtalo nele yeduredurane vumdi kosarinaam gomtagaaga

కోప మింతలో నేలే యెదురెదురనే వుండి కొసరినాఁ గొంతగాక
Language

(॥పల్లవి॥)
కోప మింతలో నేలే యెదురెదురనే వుండి కొసరినాఁ గొంతగాక
పైపైనే వున్నాఁడు చెయిపట్టి తియ్యఁగదే పంతగాఁడుగదె నీకంటెను

(॥కొప॥)
మెత్తనిమాఁటేలాడేవే అతనితో మేకులైనాఁ గొంతగాక
పొత్తు లేకుండితేనే అతనికి నీకుఁ బండి పొల్లవొయనా వలపు
చిత్తమేల చిన్నఁబోయేవే పైపడి చెనకినఁ గొంతఁగాక
హత్తి యాడలనుండెఁగాని తమియెల్ల నీపైనే అతనికి నీకంటెను

(॥కొప॥)
సారెసానేల మొక్కేవే యాతిని సాదించినాఁ గొంతగాక
తారి చూడకుండితే నిమిషములోననే తతిదప్పినా వయసు
నేరమేల యెంచుకొనేవే పతివద్ద నిండుకున్నాఁ గొంతగాక
కేరికేరి నవ్వెఁగాని అతఁడు దగ్గరితే కిందుపడు నీకంటెను

(॥కొప॥)
సిగ్గున నీవేల కొంకేవే గోరికొనఁ జిమ్మినాఁ గొంత గాక
వొగ్గి కాఁగిలించితేనే అతనినీసంది వుడివొయనా చలము
యెగ్గులేల యిఁకఁ బట్టేనేఁ శ్రీవేంకటేశ్వరుఁ డిదె కూడెను
అగ్గపు నీమోవి గంటిసేసె నింతేకాని గుట్టు అతనికి నీకంటెను

(||pallavi||)
koba miṁtalo nele yĕdurĕdurane vuṁḍi kŏsarinām̐ gŏṁtagāga
paibaine vunnām̐ḍu sĕyibaṭṭi tiyyam̐gade paṁtagām̐ḍugadĕ nīgaṁṭĕnu

(||kŏba||)
mĕttanimām̐ṭelāḍeve adanido megulainām̐ gŏṁtagāga
pŏttu leguṁḍidene adanigi nīgum̐ baṁḍi pŏllavŏyanā valabu
sittamela sinnam̐boyeve paibaḍi sĕnaginam̐ gŏṁtam̐gāga
hatti yāḍalanuṁḍĕm̐gāni tamiyĕlla nībaine adanigi nīgaṁṭĕnu

(||kŏba||)
sārĕsānela mŏkkeve yādini sādiṁchinām̐ gŏṁtagāga
tāri sūḍaguṁḍide nimiṣhamulonane tadidappinā vayasu
neramela yĕṁchugŏneve padivadda niṁḍugunnām̐ gŏṁtagāga
kerigeri navvĕm̐gāni adam̐ḍu daggaride kiṁdubaḍu nīgaṁṭĕnu

(||kŏba||)
sigguna nīvela kŏṁkeve gorigŏnam̐ jimminām̐ gŏṁta gāga
vŏggi kām̐giliṁchidene adaninīsaṁdi vuḍivŏyanā salamu
yĕggulela yim̐kam̐ baṭṭenem̐ śhrīveṁkaḍeśhvarum̐ ḍidĕ kūḍĕnu
aggabu nīmovi gaṁṭisesĕ niṁtegāni guṭṭu adanigi nīgaṁṭĕnu