Kimdu meemdu neṟamgamdu kelaseem gaadaramuna

కిందు మీఁదు నెఱఁగఁడు కెలసీఁ గాతరమున
Language

(॥పల్లవి॥)
కిందు మీఁదు నెఱఁగఁడు కెలసీఁ గాతరమున
చందము సేయఁగదరే సతులాల

(॥॥)
పొద్దువోదా తన కేమి పొలఁతులెల్లా నవ్వఁగా
వుద్దండపునవ్వు నవ్వి వొడివట్టీ
పెద్దరికమా యిదేమి ప్రియురాండ్ల నింత సేయ
బుద్దులుచెప్పరే మీరు పూఁచి చెల్లులాల

(॥॥)
వుండఁబట్టదా తనకు నూడిగము సేయుఁగాను
చండిపెట్టి వాఁతవాశి చన్నుల మీఁద
బండారము గూడెనా పడఁతులఁ తక్కించఁగా
అండనుండి వేఁడుకోరే అతివలాల

(॥॥)
పాయపుమదమా యిది పంతానఁ దెరలోన
ఆయమంటి నన్నుఁగూడె నచ్చలానను
చేయి మీఁదాయఁగా నేఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
పాయకున్నాఁడు మెచ్చరే భామలాల

(||pallavi||)
kiṁdu mīm̐du nĕṟam̐gam̐ḍu kĕlasīm̐ gādaramuna
saṁdamu seyam̐gadare sadulāla

(||||)
pŏdduvodā tana kemi pŏlam̐tulĕllā navvam̐gā
vuddaṁḍabunavvu navvi vŏḍivaṭṭī
pĕddarigamā yidemi priyurāṁḍla niṁta seya
buddulusĕppare mīru pūm̐si sĕllulāla

(||||)
vuṁḍam̐baṭṭadā tanagu nūḍigamu seyum̐gānu
saṁḍibĕṭṭi vām̐tavāśhi sannula mīm̐da
baṁḍāramu gūḍĕnā paḍam̐tulam̐ takkiṁcham̐gā
aṁḍanuṁḍi vem̐ḍugore adivalāla

(||||)
pāyabumadamā yidi paṁtānam̐ dĕralona
āyamaṁṭi nannum̐gūḍĕ nachchalānanu
seyi mīm̐dāyam̐gā nem̐ḍu śhrīveṁkaḍeśhvarum̐ḍu
pāyagunnām̐ḍu mĕchchare bhāmalāla