కనుకొనరాదా కడమదొడములెల్లా
(॥పల్లవి॥)
కనుకొనరాదా కడమదొడములెల్లా
పనివడి నీముందరఁ బచారించీ నిఁకను
(॥॥)
బంతి నాపె మొక్కఁగాను పరాకులు సేసుకొంటే
పంతమాడఁదగదా పడఁతికిని
ఇంతలో నిందుకుఁగాను యెగ్గు లేల పట్టేవు
దొంతరవలపులను తోడుచూపీ నిఁకను
(॥॥)
యెనసి కానుకియ్యఁగా నేమీననక వుండితే
పెనఁగఁగఁ దగగా ప్రియురాలికి
యెనలేని తలపోఁత నిచ్చోట నేమిటికి
వెనకటి సేఁతలెల్లా వెలయించీ నిఁకను
(॥॥)
సారెఁ బాదా లొత్తఁగాను జడిసి నిద్దిరించితే
గోర గీరఁదగదా కోమలికిని
యీరీతి శ్రీ వేంకటేశ యేలి యింకాఁ గొసరేవు
కోరికరతులు నీకుఁ గుప్ప సేసీ నిఁకను
(||pallavi||)
kanugŏnarādā kaḍamadŏḍamulĕllā
panivaḍi nīmuṁdaram̐ basāriṁchī nim̐kanu
(||||)
baṁti nābĕ mŏkkam̐gānu parāgulu sesugŏṁṭe
paṁtamāḍam̐dagadā paḍam̐tigini
iṁtalo niṁdugum̐gānu yĕggu lela paṭṭevu
dŏṁtaravalabulanu toḍusūbī nim̐kanu
(||||)
yĕnasi kānugiyyam̐gā nemīnanaga vuṁḍide
pĕnam̐gam̐gam̐ dagagā priyurāligi
yĕnaleni talabom̐ta nichchoḍa nemiḍigi
vĕnagaḍi sem̐talĕllā vĕlayiṁchī nim̐kanu
(||||)
sārĕm̐ bādā lŏttam̐gānu jaḍisi niddiriṁchide
gora gīram̐dagadā komaligini
yīrīdi śhrī veṁkaḍeśha yeli yiṁkām̐ gŏsarevu
korigaradulu nīgum̐ guppa sesī nim̐kanu