కన్నెదానవైతేనేమి కాఁపురాలు సేసేవేళ
(॥పల్లవి॥)
కన్నెదానవైతేనేమి కాఁపురాలు సేసేవేళ
యెన్నేసి వేసాలు సేసే విదేమే నీవు
(॥కన్నె॥)
శిరసేల వంచేవే శిగ్గులేల పెంచేవే
సరుస నీరమణుఁడు సారె నవ్వఁగా
పరాకేల సేసేవే భావమేల మూసేవే
మరిగి యాతఁడు నీపై చల్లఁగాను
(॥కన్నె॥)
చెక్కు చెయ్యేల పెట్టేవే చెలులనేల తిట్టేవే
మక్కువతో నీవిభుఁడు మాఁటలాడఁగా
చక్కఁగా నేమి చూచేవే చాఁచి గోరేమి రాచేవే
అక్కరతో యితఁడు నిన్నంటివేఁడుకోగాను
(॥కన్నె॥)
చన్నులేల కప్పేవే సణఁగులేల గుప్పేవే
అన్నిటా శ్రీవేంకటేశుఁ డాదరించఁగా
మిన్నకేల సొలసేవే మెచ్చియంత యలసేనే
మన్నించీతఁడు రతులు మతి చొక్కించఁగాను
(||pallavi||)
kannĕdānavaidenemi kām̐purālu seseveḽa
yĕnnesi vesālu sese videme nīvu
(||kannĕ||)
śhirasela vaṁcheve śhiggulela pĕṁcheve
sarusa nīramaṇum̐ḍu sārĕ navvam̐gā
parāgela seseve bhāvamela mūseve
marigi yādam̐ḍu nībai sallam̐gānu
(||kannĕ||)
sĕkku sĕyyela pĕṭṭeve sĕlulanela tiṭṭeve
makkuvado nīvibhum̐ḍu mām̐ṭalāḍam̐gā
sakkam̐gā nemi sūseve sām̐si goremi rāseve
akkarado yidam̐ḍu ninnaṁṭivem̐ḍugogānu
(||kannĕ||)
sannulela kappeve saṇam̐gulela guppeve
anniḍā śhrīveṁkaḍeśhum̐ ḍādariṁcham̐gā
minnagela sŏlaseve mĕchchiyaṁta yalasene
manniṁchīdam̐ḍu radulu madi sŏkkiṁcham̐gānu