కంతుని బలగము లివివో కైతప్పౌ నేమన్నా
(॥పల్లవి॥)
కంతుని బలగము లివివో కైతప్పౌ నేమన్నా
సంతంబయ్యినమీఁదట సందింతువు గాని
(॥కంతు॥)
సరుగన దగ్గరిరా కిటు చనుజక్కవ లిటు బెదరీ
అరుదుగ మరేమిగలిగిన నందుండే పలుకు
గరిమలఁ బిలువకు మంతేసికంచపు మోవిదె యదరీ
యిరవుగఁ జేసన్నలనే యెరిఁగింతువుగాని
(॥కంతు॥)
నిలువునఁ జూడకు మంతేసి నెరిఁదుమ్మిదలివెయఁగినీ
వలపు లవేమి గలిగినా వడిఁ బారఁగఁజల్లు
కలకలనవ్వకు మంతేసి కరములచిగురులు గదిలీ
వెలినే నీయెమ్మె లెదట వెదచల్లుదుగాని
(॥కంతు॥)
కాఁగిట కడుఁబీడించకు కన్నుచకోరము లుదిరీ
మాఁగినరతు లేమిగల్లా మన్నించే చూపు
వీఁగక పానుపుపై శ్రీవేంకటపతిననుఁ గూడితి
ఆఁగిననిటూర్పు లడఁచీ అరమఱతువుగాని
(||pallavi||)
kaṁtuni balagamu livivo kaidappau nemannā
saṁtaṁbayyinamīm̐daḍa saṁdiṁtuvu gāni
(||kaṁtu||)
sarugana daggarirā kiḍu sanujakkava liḍu bĕdarī
aruduga maremigaligina naṁduṁḍe palugu
garimalam̐ biluvagu maṁtesigaṁchabu movidĕ yadarī
yiravugam̐ jesannalane yĕrim̐giṁtuvugāni
(||kaṁtu||)
niluvunam̐ jūḍagu maṁtesi nĕrim̐dummidalivĕyam̐ginī
valabu lavemi galiginā vaḍim̐ bāram̐gam̐jallu
kalagalanavvagu maṁtesi karamulasigurulu gadilī
vĕline nīyĕmmĕ lĕdaḍa vĕdasalludugāni
(||kaṁtu||)
kām̐giḍa kaḍum̐bīḍiṁchagu kannusagoramu ludirī
mām̐ginaradu lemigallā manniṁche sūbu
vīm̐gaga pānububai śhrīveṁkaḍabadinanum̐ gūḍidi
ām̐ginaniḍūrbu laḍam̐sī aramaṟaduvugāni