Kamtivo kaanavo kaani ghanamai naamoha midi

కంటివో కానవో కాని ఘనమై నామోహ మిది
Language

(॥పల్లవి॥)
కంటివో కానవో కాని ఘనమై నామోహ మిది
వెంటవెంట నీకు వేవేలై వున్నదిరా

(॥కంటి॥)
నెమ్మది నాశిరసే నీతొడపై నుండెఁగాని
కమ్మర నాచిత్తము నీకాఁగిటిపై నుండెరా
దొమ్మి నాకొనగోరు నీతొడమీంద నుండెఁగాని
పమ్మి నాయాస నీమోవి పంటిపై నున్నదిరా

(॥కంటి॥)
పాయక నాచన్నులు నీపాదముపై నుండెఁగాని
మోయుచు నాచూపు నీమొగముపై నుండెరా
చేయార నాచేఁతలు నీసిగ్గులపై నుండెఁగాని
మాయపుదిట్లు నీమానముపై నుండెరా

(॥కంటి॥)
పొంది నాతములను నీపుక్కిటిలో నుండెఁగాని
చందపునాకుటమి నీసమరతి నుండెరా
వొందిలి శ్రీవేంకటేశ వురాన నే నుందుఁగాని
అందపునావయసు నియాతుమ నున్నదిరా

(||pallavi||)
kaṁṭivo kānavo kāni ghanamai nāmoha midi
vĕṁṭavĕṁṭa nīgu vevelai vunnadirā

(||kaṁṭi||)
nĕmmadi nāśhirase nīdŏḍabai nuṁḍĕm̐gāni
kammara nāsittamu nīgām̐giḍibai nuṁḍĕrā
dŏmmi nāgŏnagoru nīdŏḍamīṁda nuṁḍĕm̐gāni
pammi nāyāsa nīmovi paṁṭibai nunnadirā

(||kaṁṭi||)
pāyaga nāsannulu nībādamubai nuṁḍĕm̐gāni
moyusu nāsūbu nīmŏgamubai nuṁḍĕrā
seyāra nāsem̐talu nīsiggulabai nuṁḍĕm̐gāni
māyabudiṭlu nīmānamubai nuṁḍĕrā

(||kaṁṭi||)
pŏṁdi nādamulanu nībukkiḍilo nuṁḍĕm̐gāni
saṁdabunāguḍami nīsamaradi nuṁḍĕrā
vŏṁdili śhrīveṁkaḍeśha vurāna ne nuṁdum̐gāni
aṁdabunāvayasu niyāduma nunnadirā