కంటివిగా వోయి దీనిగబ్బితనము మా
(॥పల్లవి॥)
కంటివిగా వోయి దీనిగబ్బితనము మా-
ఇంటనే వుండుము దీనియెమ్మె లుడిపేను
(॥కంటి॥)
సొలసిసొలసి చూచి చొక్కులఁబెట్టి నిన్ను
వలపించెఁగా ఇంతవడిగా నీపె
కలికితనాల నీతోఁ గాఁపురాలు సేసిసేసి
యెలయించెఁగా దీనియెమ్మె లెటువంటివో
(॥కంటి॥)
సారెసారె మాటలాడి సన్నలుచేసి నీకు
నేరిపెఁగా వినయాలు నేఁడిన్నేసి
కూరిమి గొసరి నీగుణము లీపాటివని
యేరుపరిచెఁగా దీనియెమ్మె లెటువంటివో
(॥కంటి॥)
పెనఁగి పెనఁగి నిన్నుఁ బ్రియమునఁ గాఁగిలించి
ననుపు రేఁచెఁగా నీకు నవ్వుతానే
నను నేలితి వింతలొననే శ్రీవేంకటేశ్వర
యెనయవచ్చీ దీనియెమ్మె లెటువంటివో
(||pallavi||)
kaṁṭivigā voyi dīnigabbidanamu mā-
iṁṭane vuṁḍumu dīniyĕmmĕ luḍibenu
(||kaṁṭi||)
sŏlasisŏlasi sūsi sŏkkulam̐bĕṭṭi ninnu
valabiṁchĕm̐gā iṁtavaḍigā nībĕ
kaligidanāla nīdom̐ gām̐purālu sesisesi
yĕlayiṁchĕm̐gā dīniyĕmmĕ lĕḍuvaṁṭivo
(||kaṁṭi||)
sārĕsārĕ māḍalāḍi sannalusesi nīgu
neribĕm̐gā vinayālu nem̐ḍinnesi
kūrimi gŏsari nīguṇamu lībāḍivani
yerubarisĕm̐gā dīniyĕmmĕ lĕḍuvaṁṭivo
(||kaṁṭi||)
pĕnam̐gi pĕnam̐gi ninnum̐ briyamunam̐ gām̐giliṁchi
nanubu rem̐sĕm̐gā nīgu navvudāne
nanu nelidi viṁtalŏnane śhrīveṁkaḍeśhvara
yĕnayavachchī dīniyĕmmĕ lĕḍuvaṁṭivo