Kamtivigaa nemdu deeni kadagaaridanamulu

కంటివిగా నేఁడు దీని కతకారితనములు
Language

(॥పల్లవి॥)
కంటివిగా నేఁడు దీని కతకారితనములు
పెంటవెట్టుకొని నీతో పెచ్చువెరిగీని

(॥కంటి॥)
పాపట దువ్వుకొంటాను పడఁతి నీయెదుటను
పూఁప చన్నులు పయ్యదఁ బొదుగుకొంటా
చూపులు నాఁట రెప్పలు చొక్కి యల్లారుచుకొంటా
యీపె యెన్నిచేఁతలు నీయెదుటఁ జేసీని

(॥కంటి॥)
తములము సేసుకొంటా తమకించీ లోలోనె
చెమటలు కొనగోరఁ జిమ్ముకొంటాను
బొమముడి వెట్టుకొని పొంచిపొంచి నవ్వుకొంటా
సముకాన నెంతేసి వేసాలఁ బొరలీని

(॥కంటి॥)
కొప్పు చక్కఁబెట్టుకొంటా కూరిములు చల్లిచల్లి
చిప్పిలుమెయి సోఁక నిన్నుఁ జెనకు కొంటా
చొప్పుగా నీవు నన్నేలఁజూచి శ్రీ వేంకటేశుఁడ
ఇప్పుడు నీ ముందరఁ దా నేమినటించీని

(||pallavi||)
kaṁṭivigā nem̐ḍu dīni kadagāridanamulu
pĕṁṭavĕṭṭugŏni nīdo pĕchchuvĕrigīni

(||kaṁṭi||)
pābaḍa duvvugŏṁṭānu paḍam̐ti nīyĕduḍanu
pūm̐pa sannulu payyadam̐ bŏdugugŏṁṭā
sūbulu nām̐ṭa rĕppalu sŏkki yallārusugŏṁṭā
yībĕ yĕnnisem̐talu nīyĕduḍam̐ jesīni

(||kaṁṭi||)
tamulamu sesugŏṁṭā tamagiṁchī lolonĕ
sĕmaḍalu kŏnagoram̐ jimmugŏṁṭānu
bŏmamuḍi vĕṭṭugŏni pŏṁchibŏṁchi navvugŏṁṭā
samugāna nĕṁtesi vesālam̐ bŏralīni

(||kaṁṭi||)
kŏppu sakkam̐bĕṭṭugŏṁṭā kūrimulu sallisalli
sippilumĕyi som̐ka ninnum̐ jĕnagu kŏṁṭā
sŏppugā nīvu nannelam̐jūsi śhrī veṁkaḍeśhum̐ḍa
ippuḍu nī muṁdaram̐ dā neminaḍiṁchīni