Kamtivaa voyi yeegayyaalidanaalu

కంటివా వోయి యీగయ్యాళితనాలు
Language

(॥పల్లవి॥)
కంటివా వోయి యీగయ్యాళితనాలు
గొంటరి సతులు కొంకుదురా

(॥కంటి॥)
ప్రియముచెప్పి నేఁ బిలుచుకరాఁగా
నయాన తానేల నవ్వీ నీతో
భయమెఱఁగనిపడఁతు లెందైనా
యతాన నుండనేరుతురా

(॥కంటి॥)
కానుకిచ్చి నేఁ గన్నుల మొక్కఁగా
తానేల దీవించీ దండనుండి
పూని సిగ్గుదలపోయనికాంతలు
కానీలే తగవుగై కొందురా

(॥కంటి॥)
గక్కన నే నిన్నుఁ గాఁగిలించుకోఁగా
మిక్కిలి తానేల మించీ నీకె
యిక్కడ శ్రీవేంకటేశ లాఁతివారు
తక్కిన సుద్దులు దలఁతురా

(||pallavi||)
kaṁṭivā voyi yīgayyāḽidanālu
gŏṁṭari sadulu kŏṁkudurā

(||kaṁṭi||)
priyamusĕppi nem̐ bilusugarām̐gā
nayāna tānela navvī nīdo
bhayamĕṟam̐ganibaḍam̐tu lĕṁdainā
yadāna nuṁḍanerudurā

(||kaṁṭi||)
kānugichchi nem̐ gannula mŏkkam̐gā
tānela dīviṁchī daṁḍanuṁḍi
pūni siggudalaboyanigāṁtalu
kānīle tagavugai kŏṁdurā

(||kaṁṭi||)
gakkana ne ninnum̐ gām̐giliṁchugom̐gā
mikkili tānela miṁchī nīgĕ
yikkaḍa śhrīveṁkaḍeśha lām̐tivāru
takkina suddulu dalam̐turā